షారుఖ్ ఖాన్ చిత్రం ‘డంకీతో ఈఎస్ఎస్ గ్లోబల్ భాగస్వామ్యం

ఇమ్మిగ్రేషన్ పరిశ్రమలో పేరుగాంచిన ఈఎస్ఎస్ గ్లోబల్, దిగ్గజ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘డుంకీ’తో తన ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించినందుకు ఎంతగానో ఆనందిస్తోంది.  ఈ సహకారం ఈఎస్ఎస్ గ్లోబల్, చలనచిత్ర పరిశ్రమ రెండింటికీ ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, ఎందుకంటే ఇది ఈఎస్ఎస్ గ్లోబల్  చట్టపరమైన, ప్రముఖ ఇమ్మిగ్రేషన్ ఎక్స్ పర్ట్స్ ను మరియు పెద్ద తెరపై షారుఖ్ ఖాన్  ఆకర్షణీయమైన కథనాన్ని ఒకచోట చేర్చింది.

‘డంకీ’ అనేది కొందరు యువ వలసదారుల ప్రయాణం. తమ కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో వారు ఎదుర్కొనే సవాళ్లను అన్వేషించే మనోహరమైన చిత్రం. ఈ భాగస్వామ్యం ద్వారా, ఈఎస్ఎస్ గ్లోబల్ ఇమ్మిగ్రేషన్  ప్రాముఖ్యతను మరియు జీవితాన్ని మార్చే ప్రయాణాన్ని ప్రారంభించే వ్యక్తుల విభిన్న అనుభవాలను వెలుగు లోకి తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 21, 2023న విడుదలైన ఈ చిత్రం నిస్సందేహంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది, ఇది ఒక ప్రత్యేకమైన మరియు ఆలోచింపజేసే సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది.

ఈఎస్ఎస్ గ్లోబల్ ప్రతినిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘‘‘‘‘షారుక్ ఖాన్ నటించిన ‘డంకీ’తో భాగస్వామి అయినందుకు మేం చాలా గర్వపడుతున్నాం. ఈ సహకారం చట్టబద్ధమైన వలసదారులకు మద్దతివ్వడంలో మా నిబద్ధతను ప్రదర్శించడమే కాకుండా వలసదారులు ఎదుర్కొంటున్న పోరాటాల గురించి స్పూర్తినిస్తూ, అవగాహన కల్పించడంలో కథలు చెప్పే శక్తిని కూడా హైలైట్ చేస్తుంది. ‘డంకీ’ వినోదాన్ని అందించడమే కాకుండా ప్రేక్షకులలో సహానుభూతి, అవగాహనను పెంపొందిస్తుందని, మరింత సమగ్ర సమాజాన్ని ప్రోత్సహిస్తుందని మేం నమ్ముతున్నాం’’ అని అన్నారు.