సబ్జెక్ట్ 2023 ప్రకారం QS వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానాల్లో స్టడీ గ్రూప్ భాగస్వామ్య సంస్థలు
స్టడీ గ్రూప్ యూకే, ఐర్లాండ్ యూనివర్సిటీ భాగస్వామ్య సంస్థలలో 4 — డర్హామ్ యూనివర్సిటీ, లివర్‌పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ మరియు యూనివర్శిటీ ఆఫ్ సస్సెక్స్, — టాప్ 10లో నిలిచాయి
తన భాగస్వామ్య విశ్వవిద్యా లయాలలో నాలుగు — డర్హామ్ యూనివర్సిటీ, లివర్‌పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్, యూనివర్శిటీ ఆఫ్ సస్సెక్స్ — ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్‌లలో సబ్జెక్ట్ 2023 ద్వారా క్యూఎస్ ప్రతిష్టాత్మకమైన టాప్ 10లో సబ్జెక్ట్ లను కలిగి ఉన్నాయని ప్రముఖ అంతర్జాతీయ విద్యా ప్రదాత అయిన స్టడీ గ్రూప్ ప్రకటించింది. వివిధ కొలమానాలపై దృష్టి సారించిన అనేక గ్లోబల్ ర్యాంకింగ్‌లలో సబ్జెక్టుల వారీ ర్యాంకింగ్ ఒకటి. ఇది ఒక నిర్దిష్ట సబ్జెక్ట్ లో ప్రముఖ విశ్వవిద్యాలయాలను గుర్తించడంలో భావి విద్యార్థులకు సహాయపడే లక్ష్యంతో ఉంటుంది. స్టడీ గ్రూప్ యూకే, ఐర్లాండ్ కు చెందిన భాగస్వామ్య విశ్వవిద్యాలయాలు 15 ఈ జాబితాలో టాప్ 100లో ఉన్నాయి.
విద్యాపరంగా, యాజమాన్యంపరంగా విద్యాసంస్థ కీర్తి, అధ్యాపకుల పరిశోధన, ఇతర సూచికలపై గణనీయమైన పరిశోధన ద్వారా ర్యాంకింగ్‌లు తెలియజేయబడతాయి. జాబితాలో దాదాపు 1,600 సంస్థలు, వాటికి సంబం ధించిన సబ్జెక్ట్ కోర్సులు ఉన్నాయి.
అత్యుత్తమ అభ్యాస అనుభవాలు, ప్రత్యేక బోధన, విశ్వవిద్యాలయాలకు అనుసంధానించబడిన అంతర్జాతీయ అధ్యయన కేంద్రాలలో అంతర్జా తీయ విద్యార్థుల కోసం రూపొందించబడిన మద్దతును అందించడం ద్వారా స్టడీ గ్రూప్ తన యూకే, ఐర్లాండ్ భాగస్వామ్య విశ్వవిద్యాలయాలలో చదువుకునేందుకు, విజయవంతం కావడా నికి అంతర్జాతీయ విద్యార్థులకు మద్దతు ఇస్తుంది.
ఈ సందర్భంగా స్టడీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ (యూనివర్శిటీ పార్టనర్‌షిప్స్, యూకే & ఐర్లాండ్) డాక్టర్ మార్క్ కన్నింగ్‌టన్ మాట్లాడుతూ, “సబ్జెక్ట్స్ వారీగా క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో ఉన్న అన్ని విశ్వ విద్యాలయాలకు అభినందనలు’’ అని అన్నారు.
“ఈ ర్యాంకింగ్స్ లో మా భాగస్వామ్య సంస్థలలో అనేకం అగ్రశ్రేణి 100 స్థానాలలో గుర్తింపు పొందడం పట్ల మేం సంతోషిస్తున్నాం. యజమాన్యం, విద్యా ఖ్యాతిని దృష్టిలో ఉంచుకుని, సబ్జెక్ట్ వారీగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సి టీ ర్యాంకింగ్‌లు మా కాబోయే విద్యార్థులకు విలువైన వనరు. మేం వారి విద్య, ఉపాధి లక్ష్యాలకు అనుగుణంగా కోర్సులకు వారిని అనుసంధానం చేస్తున్నామని నిర్ధారించే అనేక మార్గాలలో ఇది ఒకటి’’ అని అన్నారు.
సస్సెక్స్ విశ్వవిద్యాలయం దాదాపు 17 సంవత్సరాలుగా స్టడీ గ్రూప్‌తో భాగస్వామ్యంలో ఉంది. డెవలప్‌మెంట్ స్టడీస్‌లో వరుసగా ఏడవ సంవత్సరం మొదటి స్థానాన్ని సాధించింది. అంతేగాకుండా, సోషియాలజీ, సైకాలజీతో సహా మరో ఐదు సబ్జెక్టులు టాప్ 100లో ర్యాంక్ పొందాయి. మరో ఐదు సబ్జె క్టులు టాప్ 150లో ఉన్నాయి. గత సంవత్సరం, యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్ ఇంటర్నేషనల్ స్టడీ సెంటర్ లో పాత్‌వే ప్రోగ్రామ్‌లను విజయ వంతంగా పూర్తి చేసిన 94% అంతర్జాతీయ విద్యార్థులకు యూనివర్సిటీలో డిగ్రీ చదివేందుకు అవకాశాలు ఇచ్చింది
షెఫీల్డ్ యూనివర్శిటీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్‌లో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోని టాప్ 200 లో 40 సబ్జెక్టులను కలిగి ఉంది. వీటిలో నాలుగు టాప్ 50లో ఉన్నాయి. స్టడీ గ్రూప్ యొక్క రస్సెల్ గ్రూప్ భాగ స్వామ్య సంస్థల్లో కార్డిఫ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, యూనివర్శిటీ ఆఫ్ షెఫీల్డ్, డర్హామ్ యూని వర్సిటీలకు సంబంధించి 75 సబ్జెక్టులు గ్లోబల్ టాప్ 100లో ర్యాంక్ పొందాయి. ఈ శ్రేణి సబ్జెక్ట్ లు రస్సెల్ గ్రూప్ విశ్వవిద్యాలయాల ఉన్నత విద్యా ప్రమాణాలకు నిదర్శనం. గత సంవత్సరం, రస్సెల్ గ్రూప్ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో స్టడీ గ్రూప్ అందించిన ప్రిపరేటరీ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన 86% మంది అంతర్జాతీయ విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాలలో చదువుకోవడానికి అవకాశాలను పొందారు.
అబెర్డీన్ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా టాప్ 100లో ర్యాంక్ పొందిన ఆరు సబ్జెక్టులను అందిస్తోంది. ఇక, యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్‌క్లైడ్‌లో బోధించబడే నాలుగు ఇంజనీరింగ్ సంబంధిత సబ్జెక్టులు టాప్ 150లో ఉన్నాయి. అంతేగాకుండా, స్టడీ గ్రూప్‌తో దశాబ్దకాలం పాటు భాగస్వామ్యం కలిగి ఉన్న యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్, ప్రపంచంలోని బెస్ట్ 100 ర్యాంక్‌లు పొందిన సబ్జెక్టులలో 12 సబ్జెక్టులను కలిగిఉంది.
పైన పేర్కొన్న విశ్వవిద్యాలయాలతో పాటు, సబ్జెక్ట్ 2023 ద్వారా QS వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ లో స్టడీ గ్రూప్ నకు చెందిన అనేక ఇతర భాగస్వామ్య సంస్థలు చేర్చబడ్డాయి. అవి: కింగ్‌స్టన్ విశ్వవిద్యాలయం, లీడ్స్ బెకెట్ విశ్వవిద్యాలయం, రాయల్ హాలోవే, యూనివర్సిటీ ఆఫ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ హడర్స్ ఫీల్డ్, యూనివర్సిటీ ఆఫ్ సర్రే. అంతేగాకుండా, స్టడీ గ్రూప్ ఉత్తర అమెరికా భాగస్వామ్య సంస్థలలో రెండు, డిపాల్ విశ్వవిద్యాలయం, ఫ్లోరిడా అట్లాంటిక్ విశ్వవిద్యాలయం ఈ ర్యాంకింగ్స్ లో ఉన్నాయి.