మరణించి మరో ముగ్గురిలో జీవించి

మరణించినా…. తమ వారిని మరోకరిలో చూసుకోవచ్చని నిరూపించారు హెచ్ ఎం టి నగర్ కి చెందిన ఓ కుటుంబం. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ లోని హెచ్ ఎం టి ప్రాంతానికి చెందిన మామిళ్ల అనురాధ (53) వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్. జనవరి 22 మధ్యాహ్నం తన సొంత పనుల నిమిత్తం బైక్ పై వెళ్తుండంతో అదుపుతప్పి కిందపడిపోయారు. స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకవెళ్లారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను రక్షించడానికి వైద్యులు ఎంతో శ్ర‌మించారు. కానీ దురుదృష్ట‌వశాస్తూ ఆదివారం బ్రెయిన్ డెడ్ అయ్యారు.
ఆ త‌ర్వాత అవ‌య‌వ‌దానంపై కిమ్స్ ఆస్పత్రిలోని అవయవదాన సమన్వయ కర్తలు, మృతురాలి కుటుంబ సభ్యులకు, బంధువుల‌కు, అవ‌గాహ‌న‌ క‌ల్పించారు. అనంతరం భర్త, కుమారుడు, కుమార్తె అంగీకారంతో లివర్, కిడ్నీలు, లివర్ దానం చేశారు. చ‌నిపోతూ మ‌రొకరి కుటుబంబాల్లో వెలుగులు నింపినందుకు గ‌ర్వంగా ఉంద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. మృతురాలికి భర్త వెంకటేశ్వర్లు, కూతరు సాయిగీత(25) కుమారుడు రాహుల్ (23) ఉన్నారు. జీవ‌న్‌ధాన్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ ద్వారా అవ‌స‌రం ఉన్న‌చోటికి అవయవాలను తరలించారని జీవన్ దాన్ కమిటీ సభ్యులు తెలిపారు.