లక్ష్మిపార్వతి సిగ్గుమాలింది – కాట్రగడ్డ

వైకాపా నాయకులు లక్ష్మిపార్వతి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన. నందమూరి కుటుంబంలోని మరణానాన్ని రాజకీయంగా వాడుకోవడమంత సిగ్గుమాలని పని ఇంకొక్కటి లేదని అన్నారు. తన సొంత పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి స్వయంగా తారక్ రత్న మరణం మీద బెంగుళూరు హాస్పిటల్ వద్ద మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబ మనిషినని చెప్పుకొనే తను ఆ ఇంట్లో పని మనిషికి కూడా పనికిరాదని విమర్శంచారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కాలగోటికి కూడా సరిపోని ఆమె విమర్శంచడం ఆమె స్థాయి ఏంటోనని తేలిపోయిందన్నారు. నందమూరి కుటుంబం సభ్యురాలి అయితే ఇలా మాట్లాడరని అన్నారు. రాజకీయ లబ్ధికోసం విమర్శలు చేయడం తగదన్నారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు, లోకేష్ పేర్లు ఎందుకు తీసుకరావాలని ప్రశ్నించారు. ఇంకా తారక్ రత్న మరణంపై అనుమానులు ఉంటే… విజయసాయి రెడ్డిని అడిగి తెలుసుుకోవాలని సూచించారు.