జిహెచ్ఎంసీ కార్మికులకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు

అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్స్‌-ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి. రఘురామ్‌ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ సిబ్బంది రాత్రిపూట, తెల్లవారుజాము వరకు కష్టతరమైన సమయాల్లో పనిచేస్తారు. దుమ్ము మరియు వాయు కాలుష్యం మరియు అనేక సార్లు వారి ప్రాణాలను పణంగా పెడుతారు. అంర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ లో 50 ఏళ్లు పైబడిన 400 మంది పారిశ్యుద్ద మహిళా కార్మికులకు ఉచితంగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను చేశాము. ఈ ఉచిత పరీక్షలను అత్యాధుని 3డి మామోగ్రఫీ సిస్టమంతో ఫిబ్రవరి 4 నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. రొమ్ము క్యాన్సర్ పై ప్రజల్లో ఇంకా అవగాహన రావాలన్నారు. ముందుగా అన్ని వయసుల స్త్రీలు తప్పనిసరిగా ‘రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు’. మరియు రొమ్ములో ఏదైనా కొత్త మార్పులను గమణిస్తే వెంటనే వైద్యుడికి సంప్రదించాలరి సూచించారు. 40 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా వార్షిక మామోగ్రామ్ స్క్రీనింగ్ చేయించుకోవాలన్నారు.
కిమ్స్ హాస్పిటల్స్ ఛైర్మన్, ఎండి డా. భాస్కర్ రావు మాట్లాడుతూ పారిశ్యుద్య కార్మికులకు ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చొరవను నిర్వహించాలనే మా ప్రతిపాదనను తక్షణమే అంగీకరించినందుకు జిహెచ్‌ఎంసి చైర్మన్ లోకేష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. కిమ్స్ హాస్పిటల్స్ సమీపంలో సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2013లో, డాక్టర్ రఘు రామ్ ఈ జిహెచ్ఎంసీ కార్మికులకు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన వ్యాయామాన్ని నిర్వహించారు. చాలా మంది ప్రాణాలను కాపాడడంలో ఎంతో దోహదపడే ఈ చొరవను మరోసారి చేపట్టినందుకు నేను అతన్ని అభినందిస్తున్నాను. కార్పొరేట్-సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, కిమ్స్ హాస్పిటల్స్ ఈ సంవత్సరం 400 మంది నిరుపేద మహిళలను చేయనుంది.