పెళ్లి భాజాలు మోగిల్సిన ఇంటిలో మరణ ఘోష

మరో పది రోజుల్లో ఆ ఇంటిలో పెళ్లి. ఇళ్లాంతా సందడి మొదలైంది. కానీ పెళ్లి కూతరు చెల్లికి ఆకస్మాత్తుగా మొదడులో రక్తంగడ్డకట్టి బ్రెయన్ స్ట్రోక్ వచ్చి మరణించి ఆ ఇంట విషాదాన్ని మిగిల్చింది. పెళ్లి భాజాలు మొగాల్సిన ఇంట చావు డప్పులు మొగాయి. ఓ వైపు కూతురు పెళ్లి, మరో వైపు మరో కూతురు మరణించిన పుట్టెడు దు:ఖంలో ఉన్నా… ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం అందరికి ఆదర్శవంతమైంది. మరణించినా… మరో ముగ్గురికి ఊపిరిపోశారు. వివరాల్లోకి వెళ్తే… కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం శ్రీనగర్ కాలనీకి చెందిన సుచిత్ర బెంగళూరులోని ఓ ఐటి కంపెనీలో పని చేస్తుంది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పి రావడంతో బెంగళూరులో ఉన్న స్థానిక హాస్పిటల్ కి తీసుకవెళ్లారు. మొరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కి తీసుకవచ్చారు. మొదడులో రక్తం గడ్డకట్టి, క్లాట్స్ వచ్చాయి. తనని రక్షించడానికి మూడు రోజుల పాటు వైద్యులు ఎంతో శ్ర‌మించారు. కానీ దురుదృష్ట‌వశాస్తూ సోమవారం రోజున బ్రెయిన్ డెడ్ గా మరణిచింది.
ఆ త‌ర్వాత అవ‌య‌వ‌దానంపై కిమ్స్ హాస్పిటల్ లోని అవయవదాన సమన్వయ కర్తలు, మృతురాలి కుటుంబ సభ్యులకు, బంధువుల‌కు అవ‌గాహ‌న‌ క‌ల్పించారు. అనంతరం వారి అంగీకారంతో కిడ్నీలు, లివర్ దానం చేశారు. చ‌నిపోతూ మ‌రో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపింనందుకు గ‌ర్వంగా ఉంద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. జీవ‌న్‌ధాన్ ఆధ్వ‌ర్యంలో అవ‌స‌రం ఉన్న‌చోటికి లివర్, కిడ్నీలను తరలించారని ఆ కమిటీ సభ్యులు తెలిపారు.