రాజకీయ బిక్షకోసమే కేసీఆర్ ఎత్తుగడలు – కాట్రగడ్డ

రాజకీయ బిక్ష కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాపత్రేయపడుతున్నారని ఎద్దేవా చేశారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. తెలంగాణలో కేసీఆర్ కి నూకలు చెల్లాయని అన్నారు. తెలంగాణ పేరు పలికే అర్హత కూడా ఆయన కొల్పోయారని విమర్శించారు. ఇక్కడి రైతులకు, ప్రజలకు ఏం చేశారని, ఏపీలో అడుగు పెడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి కాదని, సోషల్ మీడియాలో అనేక పేర్లు చక్కర్లు కొడుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని భయంతోనే, రాజకీయ పర్యటనకు బయలు దేరారని ఆమె అన్నారు.