డైవర్షన్ పొలిటికల్స్ చేస్తున్న తెరాస, వైకాపా – మాధవి

తమ తప్పులను పక్కదోవ పట్టించుకోవడం కోసం వైకాపా, తెరాస కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు కొల్లి మాధవి. అమరుల త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రాన్ని తిరిగి కలపాలని కోరుకోవడం సిగ్గుచేటన్నారు. వైకాపా నాయకులు సజ్జల మాటలు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు తిరిగి కలవడం అనేది అసాధ్యమన్నారు. కొన్ని సంఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తొలిదశ, మలిదశ ఉద్యమాలు జరిగాయని, ఈ ఉద్యమాల గడ్డ గురించి చిన్నచూపుగా మాట్లాడడం ఎంత వరకు సమజంమని ప్రశ్నించారు. మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీదని హితవు పలికారు. మీ హక్కల కోసం పోరాటం చేసుకోవాలని సూచించారు. అంతేకాని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మీకు తగదు.