గుజరాత్ లో కాషాయం రెపరెపలు

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భాజపా సత్తా చాటిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘యూపీ రాంపూర్‌లో, బిహార్‌ ఉపఎన్నికల్లో భాజపా అద్భుత ప్రదర్శన చేసింది. బిహార్‌లో మున్ముందు భాజపా విజయానికి ఇది చిహ్నం. హిమాచల్‌లో 1శాతం తేడాతో అధికారం కోల్పోయాం. ఆ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ బాగా పోరాడాం. అక్కడి ప్రజలను వంచించి ఎన్నికల్లో గెలుపొందారు. అది మాకిష్టం లేదు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేం’’ అని మోదీ అన్నారు. గుజరాత్ మళ్లీ అధికారంలోకి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.