తుదుశ్వాస విడిచిన విద్యార్థిని శశికళ

విశాఖ పట్నం సమీపంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో సిఏ చదువుతున్న విద్యార్థిని పట్టాల మద్య ఇరుక్కుని ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాటం చేసింది. పట్టాల మద్య నుంచి తీసిన వెంటనే చికిత్స కోసం షీలా నగర్ లోని కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కు తరలించారు. శశికళ ప్రాణాలు కాపాడడం కోసం వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ ఎక్కువ రక్తస్రావం కావడం, అవయవాల పనితీరు దెబ్బతినడంతో మ్రుత్యువుతో పోరాడి గురువారం మధ్యాహ్నాం ప్రాణాలు విడిచింది.