ఆళ్ల‌పై లోకేష్ మండిపాటు

మంగళగిరి నియోజకవర్గంలో “బాదుడే బాదుడు” కార్యక్రమంలో భాగంగా నూతక్కి గ్రామంలో నారా లోకేష్ పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి మరీ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.ఎలాంటి కష్టం ఉన్నాగాని ఆదుకుంటానని గ్రామస్తులకు లోకేష్ భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.నియోజకవర్గంలో ఒక ఇల్లు కట్టలేదు. కానీ వేలాది ఇల్లు కూల్చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సైకో మాదిరిగా ధరలు, చార్జీలు, పన్నులు పెంచేశారని విమర్శించారు.గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం. వేలకోట్లు కేటాయించినట్లు చెబుతున్న వైసిపి ప్రభుత్వం.ఎమ్మెల్యే అవి ఎక్కడ దాచారో.? ఖర్చు చేశారో.? వెల్లడించాలని డిమాండ్ చేశారు.పన్నుల పేరుతో ప్రజలను ఇబ్బందులు పాలు చేయడానికి అధికారులకు టార్గెట్లు విధిస్తున్నారు అంటూ విమర్శించారు.చివర ఆఖరికి ఖాళీ స్థలాలను కూడా వదలకుండా పన్నులు వసూలు చేయాలని అధికారికంగా ఎమ్మెల్యే ఆదేశించటం దారుణమని అన్నారు.