బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభించిన మెలొరా

డైమండ్, జెమ్ స్టోన్ ధరలపై ఏకమొత్తంగా 30% తగ్గింపు

మేకింగ్ ఛార్జీలపై 100% వరకు డిస్కౌంట్

నవంబర్ 2022: భారతదేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న డి2సి బ్రాండ్లలో ఒకటైన, ట్రెండీ, లైట్ వెయిట్, బిఐఎస్ హాల్ మార్క్ కలిగిన ఆభరణాలను అందుబాటు రేట్లకు అందిస్తున్నమెలోరా నేడిక్కడ తన 6 రోజుల బ్లాక్ ఫ్రైడే సేల్ ను ప్రారంభించింది. కొనుగోలుదారులు ఆన్ లైన్ ద్వారా లేదా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సంస్థ ఎక్స్ పీరియెన్స్ సెంటర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మెలోరా ఇప్పటికే భారతదేశ అత్యు త్తమ, రోజూ ధరించే ఆభరణాల బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. భారతదేశం, యూఏఈ, యూఎస్ఏ, యూకే, యూరప్ లలో 26,000కు పైగా పిన్ కోడ్స్ లో తన ఉనికి కలిగి ఉంది. ఇంకా విస్తరిస్తూనే ఉంది.

మెలోరా బ్లాక్ ఫ్రైడే సేల్ అన్ని డైమండ్, విలువైన రాళ్ల ధరలపై ఏకమొత్తంగా 30% డిస్కౌంట్ ను అందిస్తోంది. అదే విధంగా తయారీ ఛార్జీలపై ఆకర్షణీయమైన రీతిలో 100% దాకా తగ్గింపును ఇస్తోంది. కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులను వినియోగించినట్లయితే, అదనంగా 10% డిస్కౌం ట్ కూడా పొందవచ్చు.

ఈ విభాగంలో ఈ బ్రాండ్ మార్కెట్ లీడర్ గా ఉంది. తన ట్రెండీ డిజైన్లతో, తక్కువ ధరలతో అందరినీ ఆకట్టుకుం టోంది. కరోనా మహమ్మారి సమయంలోనూ మెలోరా వృద్ధి సాధించింది. లైట్ వెయిట్ జ్యుయలరీలో డిమాండ్ ను, ప్రజాదరణను పెంచుకోగలిగింది.

ఈ విక్రయం గురించి మెలోరా వ్యవస్థాపకులు, సీఈఓ సరోజా యెరమిల్లి మాట్లాడుతూ,‘‘బ్లాక్ ఫ్రైడే అనేది సంప్రదాయకంగా క్రిస్మస్ షాపింగ్ సీజన్ ప్రారంభంతో ముడిపడి ఉంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి పండుగ సీజన్లకు మేం సంసిద్ధమయ్యాం. స్టయిలిష్, ఎవ్రీడే జ్యుయలరీ విస్తృత శ్రేణి ఇప్పుడు అందుబాటులో ఉంది. దేశంలో వీటి లభ్యతను ఆన్ లైన్ షాపింగ్ మరింత అధికం చేయనుంది. దేశం నలుమూలలా మా కొనుగోలుదారులు ఉన్నారు. లైట్ వెయిట్, తక్కువ ధర, ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఆధునిక ఆభరణాలను తయారు చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. భారతీయులందరినీ చేరుకోవాలని, వారి సమకాలీన వార్డ్ రోబ్ కు అనుగుణమైన ఎంపికలను అందించాలని మెలోరా కోరుకుంటోంది. రెండేళ్ల పాటు కొనసాగిన కొవిడ్ తరువాత, ఈ ఏడాది ప్రజలు పండుగలను కుటుంబంతో, స్నేహితులతో కలసి ఘనంగా వేడుక చేసుకోనున్నారు. మహిళలు ప్రతిరోజూ ధరించగలిగే లైట్ వెయిట్ ఆభరణాలకు డిమాండ్ పెరగడాన్ని మేం చూస్తున్నాం. అంతర్జాతీయ ఫ్యాషన్ ధోరణుల నుంచి మా డిజైన్లు స్ఫూర్తి పొందాయి. పండుగ అయినా, రోజువారీ వాడకం అయినా ప్రతీ సందర్భానికి తగినట్లుగా అవి ఉంటాయి’’ అని అన్నారు.

ఆధునిక మహిళ అవసరాలను, ఆకాంక్షలను తీర్చే రీతిలో ఆభరణాలను మెలోరా అందిస్తోంది. అందుబాటు ధర, 30- రోజుల రిటర్న్ పాలసీ, మాడ్యులర్ డిజైన్ అనేవి ఈ బ్రాండ్ విశిష్టతలుగా ఉన్నాయి. అవే దీన్ని ద్వి తీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఈ బ్రాండ్ పేరొందేలా చేశాయి. ఆవిర్భవించిన నాటి నుంచి మెలోరా దేశంలో 2500 పట్టణాలలో తన ఆభరణాలను అందించింది. పదివేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలు మొదలు కొని పది లక్షలకు పైబడి జనాభా ఉన్న పట్టణాల దాకా అన్ని ప్రాంతాల్లోనూ ఇవి లభ్యమవుతున్నాయి. మెలోరా ఆభరణాలు అందుబాటు ధరల్లో 20 వేల నుంచి 50 వేల దాకా లభిస్తాయి. ఈ బ్రాండ్ ప్రతీ వారం 75కు పైగా డిజైన్లను ప్రవేశపెడుతోంది. కొనుగోలుదారులు ఉన్న ప్రతీ చోటా ఈ బ్రాండ్ దర్శనమిస్తోంది. అది ఈ బ్రాండ్ ను, దేశంలో లైట్ వెయిట్, ఫ్యాషనబుల్ బంగారు ఆభరణాలను అందించే టాప్ 5 డి2సి బ్రాండ్లలో ఒకటిగా చేసింది. అలా కావడం బంగారాన్ని ఎవ్రీడే ఫ్యాషనబుల్ గా చేసింది.