‘హిట్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంటుకి డేట్ ఖరారు

అడివి శేష్ హీరోగా ‘హిట్ 2’ సినిమా రూపొందింది. నాని తన సొంత బ్యానర్లో నిర్మించిన సినిమా ఇది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరగనుంది. ఆ కేసు విచారణను చేపట్టిన పోలీస్ అధికారిగా అడివి శేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడు.

డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటు జరగనుంది. అందుకు హైదరాబాదు .. ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్ వేదిక కానుంది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంటుకి చీఫ్ గెస్టు ఎవరన్నది ఊహించండి అంటూ సస్పెన్స్ లో పెట్టారు. 28వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించనున్న ఈ సినిమాకి ఎం. ఎం.శ్రీ లేఖ సంగీతాన్ని అందించింది.