భక్తులకు ఆలయ ప్రవేశం లేదు
పద్మారావు నగర్ శ్రీ శ్రీ స్కంద గిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నేటి నుంచి ఈనెల 31 వరకు భక్తుల దర్శనార్థం ఉండదు. కరోనా వైరస్ ప్రభావంవల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానార్చకులు తెలియచేశారు. అర్చకులు మాత్రమే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి దుర్గామాత మహా మృత్యుంజయ శివునికి యధావిధిగా పూజాదికాలు నిర్వహించబడతాయి. కానీ భక్తులకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉండదు. ఈ కరోనా వైరస్ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటే ఈ రోగం ఈ వైరస్ మరింత విస్తరించే ప్రమాదం ఉంది కాబట్టి స్కందగిరి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకు న్నారు….భక్తులు తమ నివాసం లొనే యధా విధిగా శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని స్మరించుకోవాలని తద్వారా ర ఎంతడి రోగమైనా, వైరసైనా తమ దరి చేరదని ఆలయ ప్రధానార్చకులు సూచించారు.