హర్ష సిల్క్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్…

ప్రస్తుత పరిస్థితులలో పరిసరాల పరిశుభ్రత వ్యక్తుల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు.బాగ్ అంబర్ పేట డివిజన్ నందనవనం కాలనీలో హర్ష సిల్క్ షోరూం ను అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించి మాట్లాడారు. షో రూమ్ కు వచ్చే వాళ్ళందరికీ శానిటేషన్ అందజేయాలని షోరూమ్ పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేవిధంగా నిర్వాహకులు చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులువిజయ్ కుమార్ గౌడ్ .. షోరూమ్ నిర్వాహకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.