ఏపీలో కేసీఆర్ పార్టీకి దిక్కుండదు
తెలంగాణ సీఎం కేసీఆర్..ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రగతి సాధించాలని బీఆర్ఎస్ పార్టీ ని ప్రకటించారు. దసరా సందర్బంగా జాతీయ పార్టీ ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల రాజకీయ నేతలు, ప్రజలు బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఇక ఏపీలోను కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను స్వాగతిస్తూ విజయవాడలోని వారధి ప్రాంతంలో భారీ ప్లెక్సీ లు ఏర్పాటు చేసారు. కేసీఆర్కు శుభాకాంక్షలు తెలియచేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై హోర్డింగ్లు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్. ఇదిలా ఉంటె టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ప్రభావం ఏం ఉండదంటూ స్పష్టం చేశారు. దేశంలో చాలామంది పార్టీలు పెట్టుకుంటారని.. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఏపీలో ఒకరి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి లేదన్నారు. ఏ పార్టీ వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదని.. రాబోయే 25 ఏళ్లు జగనే సీఎంగా ఉంటారని స్పష్టంచేశారు.