చిరంజీవి ఫై అసహనం వ్యక్తం చేసిన గరికపాటి

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి తో పలువురు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే అలయ్ బలయ్ కార్యక్రమం 17 ఏళ్ల నుంచి సాగుతూ వస్తోంది. బీజేపీ నేత, ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ 17 ఏళ్ల కిందట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాది దసరా మరుసటిరోజు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఆ ఆనవాయితీ కొనసాగించారు.

ఇక మెగాస్టార్ వస్తున్నారని అని తెలిసి పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తో ఫోటోలు దిగేందుకు ప్రముఖుల పిల్లలు, మహిళలు పోటీపడ్డారు. ఇక మెగాస్టార్ కూడా వచ్చిన మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ఫోటోలు ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మాట్లాడిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవితో అందరూ కూడా ఫోటోలు దిగుతూ ఉండగా ఆయన అప్పుడు తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొంత ఆయనకు ఇబ్బందిగా అనిపించడంతో వెంటనే రియాక్ట్ అయ్యారు. చిరంజీవి గారు వెంటనే ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడ పక్కన వచ్చి కూర్చోవాలని అని పదేపదే చెప్పడం జరిగింది. దీంతో చిరు ఫొటోస్ ఆపేసి వచ్చి కూర్చున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.