అమ‌రావ‌తికి టీడీపీతో మోసం – ధ‌ర్మాన‌

రాజధాని అమరావతి విషయంలో చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదో టిడిపి అధినేత చంద్రబాబు చెప్పాలని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద్ డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో టిడిపి హయాంలోనే మోసం జరిగిందని చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని అమలు చేసేందుకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ప్రస్తుతం ఏ రాష్ట్రం కూడా తమ రెవెన్యూల నుంచి రూ. 10 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి ఉందని చెప్పారు. అమరావతి రైతుల ఆవేదన కరెక్టే కావచ్చు కానీ… అంత డబ్బును అమరావతిపై పెట్టే పరిస్థితి లేదని అన్నారు. పాలనా రాజధానిగా విశాఖ వద్దని చంద్రబాబు చెపితే తాము ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మూడు రాజధానుల విషయంలో మంచి నిర్ణయాలను ఇస్తే స్వీకరించేందుకు తాము సిద్ధమని చెప్పారు.