నిర్భయ దోషులకు ఉరి శిక్షపడింది

నిర్భయ దోషులకు ఉరి శిక్షపడింది . నిర్భయను దారుణంగా అత్యాచారం చేసిన ఎనిమిదేళ్లకు ఈ మానవ మృగాలకు ఉరి శిక్ష పడింది . డిసెంబరు 16, 2012 న జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది . వీరిలో ఒకరు మైనర్‌ కావడంతో మూడేళ్ల శిక్ష అనంతరం అతణ్ని విడుదల చేశారు . మరో వ్యక్తి రామ్‌ సింగ్‌ మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నాడు . అయితే అసలు ఈ నిర్భయను చెరిచిన ఆ ఆరుగురూ ఎవరు .. అసలు వాళ్లు అంతకు ముందు ఏం చేసేవాళ్లు .. తెలుసుకుందాం ..

నిర్భయను చెరిచిన వారంతా దిల్లీలోని ఆర్‌ . కె . పురం మురికివాడ ప్రాంత నివాసితులు . వీరిలో చాలా మంది చదువు మధ్యలో మానేసిన వారే . అక్షయ్‌ ఠాకూర్‌ బిహార్‌కు చెందినవాడు . వీడు ఓ బస్సులో హెల్పర్ .. మధ్యలోనే చదువుమానేసిన ఇతడు 2011 లో దిల్లీకి వచ్చాడు . అతనికి భార్య .. ఒక కొడుకు ఉన్నారు . వారు బిహార్‌లోని స్వగ్రామంలోనే నివాసముంటున్నారు .

పవన్ గుప్తా అనే వాడు ఓ పండ్ల వ్యాపారి . నేరం జరిగిన సమయంలో ఇతనికి 19 ఏళ్లు . వీడు తిహాడ్‌ జైలు నుంచే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు . మరో దోషి రామ్‌ సింగ్‌ బస్సు డ్రైవర్ గా పని చేసేవాడు .. వీడు తిహాడ్‌ జైల్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు . భార్య నుంచి విడాకులు తీసుకున్న ఇతడు రాజస్థాన్‌ నుంచి 23 ఏళ్ల వయసులో దిల్లీకి వచ్చాడు . రామ్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకోలేదని .. అతణ్ని చంపి ఉంటారని తండ్రి ఆరోపణ .

మరో దోషి ముకేశ్ సింగ్ అనే వాడు రామ్‌ సింగ్ సోదరుడు . ఇతడు అప్పుడప్పుడు బస్సు డ్రైవింగ్‌లో సోదరుడికి సాయం చేసేవాడు . రేప్ జరిగిన టైమ్ లో వీడు బస్సు క్లీనర్‌గా ఉన్నాడు . మరో దోషి వినయ్‌ శర్మ ఓ జిమ్‌ సెంటర్‌లో ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ . ఇక చివరి వాడు రేప్ జరిగే సమయానికి ఓ మైనర్ .. అందువల్లే వీడు తప్పించుకున్నాడు . మూడేళ్ల పాటు జువైనైల్‌ హోంలో ఉండి డిసెంబరు 2015 లో విడుదలయ్యాడు .