చిన్నశేషవాహనంపై బద్రినారాయణ అలంకారంలో శ్రీమలయప్పస్వామి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు బుధవారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై బద్రి నారాయణ అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.
చిన్నశేషవాహనంకుటుంబశ్రేయస్సు
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.