అగ్రి-టెక్ విభాగంలో స్టార్టప్స్ కోసం ఇన్క్యుబేషన్ ప్రోగ్రామ్ ‘కేటలిస్ట్’ ను ప్రారంభించిన nurture.farm

అగ్రి-టెక్ విభాగంలో స్టార్టప్స్ కోసం ఇన్క్యుబేషన్ ప్రోగ్రామ్ ‘కేటలిస్ట్’ ను ప్రారంభించిన nurture.farm

ప్రి- రెవిన్యూ, సీడ్ ఫండెడ్, ఏంజెల్ – ఫండెడ్ అగ్రి-టెక్ స్టార్టప్స్ కోసం

మౌలిక వసతులు, నెట్ వర్కింగ్ కోసం సాంకేతిక మద్దతు అందించనున్న కార్యక్రమం

     | అగ్రి టెక్ పరిశ్రమ ఈ విభాగంలోకి అడుగుపెట్టిన పలు స్టార్టప్స్ తో అతి స్వల్ప వ్యవధిలోనే ఎంతగానో వృద్ధి చెందింది. అయితే వాటికి తగిన మార్గదర్శకత్వం, మెంటార్షిప్, లాభ దాయక వ్యాపార నిర్మాణం కోసం వనరులకు యాక్సెస్ వంటివి వాటికి అవసరం. ఈ నేపథ్యంలో భారతదేశ అతిపెద్ద, అగ్రగామి అగ్- టెక్ కంపెనీ అయిన nurture.farm టెక్ పరిష్కారాల ద్వారా సత్వరమే కోలుకోగల, సుస్థిరదాయక ఫామింగ్ ఆవరణ వ్యవస్థను నెలకొల్పాలని సంకల్పించింది. అందుకే అగ్రి టెక్ స్టార్టప్లు తమ కు తాముగా సుస్థిరదాయకంగా నిలిచేందు కు, మరింతగా విస్తరించేందుకు వీలు కల్పించేలా తన ఇన్క్యుబే షన్ కార్యక్రమం -కేటలిస్ట్- ను ప్రారంభించింది.

వ్యవసాయ ఆవరణ వ్యవస్థ అంతటా కీలక వ్యక్తులు, సంస్థలతో కలసి పని చేయడంలో, నిలదొక్కుకునేందుకు మూలధనం పొందడంలో, తమ ఉత్పాదనలు లేదా పరిష్కారాలను విస్తృత స్థాయిలో పరీక్షించుకునేందుకు, మౌలిక వసతులకు, జ్ఞానానికి, మానవ వనరులకు యాక్సెస్ పొందేందుకు nurture.farm కేటలిస్ట్ అనేది అగ్రిటెక్ స్టార్టప్ లకు తోడ్పతుంది. ఇన్క్యుబేట్ అయ్యే వాటికి విస్తృత స్థాయిలో మద్దతును ఈ కార్యక్రమం అందిస్తుంది. అవి తమ వృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేసుకునేలా తోడ్పడుతుంది. వృద్ధి దశ, ప్రి- రెవిన్యూ, సీడ్ ఫండెడ్ లేదా ఏంజెల్ ఫండెడ్ స్టార్టప్స్ ను వృద్ధిలోకి తీసుకురావడంపై ఈ ఇన్క్యుబేషన్ ప్రోగ్రామ్ ప్రధానంగా దృష్టి పెడుతుంది. వాటికి ఇది అండగా ఉంటుంది, కలసి పని చేస్తుంది, వాటిని చాంపియన్లుగా తీర్చిదిద్దుతుంది. nurture.farm తో భాగస్వామ్యం పొందడంవల్ల దీని అనుభవంతో స్టార్టప్ లు తమ గ్రామీణ నెట్వర్క్ ను ఏర్పరుచుకోగలుగుతాయి, పరిశ్రమలతో సంబంధాలను నెలకొల్పుకోగలుగుతాయి. ఏళ్లుగా కంపెనీ సాధించిన గుడ్ విల్ తో ప్రయోజనం పొందగలుగుతాయి.

ఈ సందర్భంగా nurture.farm బిజినెస్ హెడ్, సిఒఒ ధ్రువ్ సహనే మాట్లాడుతూ ‘‘వ్యవసాయ ఉత్పాదకత ముందెన్నడూ లేనంతగా తక్కువగా ఉంది. 2050 నాటికి 10 బిలియన్లకు చేరుకోబోయే నానాటికీ పెరిగిపోతున్న జనాభాతో ఆహారభద్రతకు ముప్పు వాటిల్లనుంది. దీనికి అదనంగా, కీటకాలు, తెగుళ్లు, ప్రకృతి విపత్తులు 40% కంటే అధిక వార్షిక ఉత్పత్తిని నాశనం చేయనున్నాయి. ఫలితంగా పంట దెబ్బ తినడం లేదా నష్టపోవడం కారణంగా ఏటా 108 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లనుంది.

పటిష్ఠమైన సాంకేతిక వేదికలు,  అగ్రి ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్లు,   మార్కెట్ లింకేజ్లు,  సప్లయ్ చెయిన్ నెట్ వర్క్లు, సలహా సేవలు, ఆర్థిక పరిష్కారాలు, షేర్డ్ ఎకానమీ మోడల్స్ను  నిర్మించడం ద్వారా దేశంలోని వివిధ ముఖ్యప్రాంతాలను అనుసంధానం చేస్తూ డిజిటల్ హైవేలను nurture.farm నిర్మించింది. పరిశ్రమ ఏకతాటిపైకి రావడం, వనరులను సమీకృతం చేయడం, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, అనుభవాలను పంచుకోవడం లాంటివి వేగవంతమైన వృద్ధికి తక్షణావసరాలుగా మారాయి.

వ్యవసాయ సంబంధిత పరిశ్రమలో వివిధ సమస్యలను చూసిన తరువాత వినూత్నత, మార్పులను ముందుకు తీసుకెళ్లే ఇతర అగ్రిటెక్ స్టార్టప్లకు మార్గం సుగమం చేయాల్సిన అవసరం ఉందని మేం గుర్తించాం. ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్న ఈ అగ్రిటెక్ స్టార్టప్లు మా ఎకోసిస్టమ్ ను ఉపయోగించుకోవచ్చు. ఒక ఉత్పాదన మార్కెట్ కు అనుగుణంగా ఉందో తెలుసుకునేందుకు పరీక్షించుకోవచ్చు. తద్వారా రైతులు, వ్యవ సాయ ఆవరణ వ్యవస్థ, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సాయం చేయవచ్చు. కార్యాచరణకు దిగాల్సిన సమయం ఆసన్నమైంది. మా ఇన్క్యుబేషన్ కార్యక్రమం ‘కేటిలిస్ట్’ అనేది ఈ లక్ష్య సాధనలో మరో ముందడుగు. మనం సుస్థిరదాయక వ్యవసాయ విధానాలను అనుసరించడంపై, ఈ రంగంతో సాంకేతికతను సమ్మిళితం చేయడానికి పని చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.

ఆయా స్టార్టప్ లు ఈ కార్యక్రమంలో చేరేందుకు nurture.farm వెబ్ సైట్ పై దరఖాస్తు చేయవచ్చు. యూపీఎల్, ఎన్పిపి, అడ్వాంటా, డెక్కో, ఐఏఆర్ఐ వంటివి మా నాలెడ్జ్ పార్ట్నర్స్గా ఉన్నాయి. వ్యవసాయ పరిశ్రమకు చెందిన అనుభవం కలిగిన నిపుణుల బృందం ప్రతీ దరఖాస్తును పరిశీలించి, ఆయా స్టార్టప్ లకు మార్గదర్శనం చేస్తూ, అవి వృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది. ఈ కార్యక్రమం కోసం 2023 మార్చి 31 వరకు దరఖాస్తులు ఆమోదించబడుతాయి.