ఇ-కామర్స్ విక్రయాలను సరళీకరించేందుకు ఇ-కామర్స్ సాంకేతికత అధునాతనలను ప్రదర్శించిన సరళ్
~యూనికామర్స్ సరళ్ కు హాజరైన 1000+ రిటైల్ బ్రాండ్లు~
~ఇ-కామర్స్ సామర్థ్యం, గొప్ప వినియోగదారు అనుభూతిని అందించే అత్యుత్తమ విధానాల ప్రదర్శన~
~ఇ-కామర్స్ కంపెనీలకు, రిటైల్ బ్రాండ్లకు చర్చా వేదికగా ఉంటూ, విశిష్ట అనుభవాలను అందించిన మెగా ఇ-కామర్స్ సమ్మిట్ సరళ్ 2022~
యూనికామర్స్ చే నిర్వహించబడిన భారతదేశ అతిపెద్ద ఇ-కామర్స్ సదస్సు భారతదేశ ఇ-కామర్స్ పరిశ్రమ వృద్ధిలో సాంకేతికత ఉత్ర్పేరక పాత్రను చాటిచెప్పింది. సెప్టెంబర్ 9న న్యూదిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఒక రోజంతా జరిగిన ఈ కార్యకర్మం సాంకేతిక ఉపకరణాలను ఉప యోగించుకోవడం ద్వారా ఆన్ లైన్ వ్యాపారాన్ని మరింత సమర్థంగా నిర్వహించడంపై ప్రధానంగా దృష్టి పెట్టిం ది. గౌరవనీయ డీపీఐఐటి అదనపు కార్యదర్శి శ్రీ అనిల్ అగర్వాల్ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ఒక ఇ-కామర్స్ లావాదేవీని సాధ్యం చేసేలా ప్రతీ ప్రక్రియను ఓఎన్‌డిసీ వేరు చేస్తుంది. విక్రేత, కొనుగోలుదారు, పేమెంట్ సిస్టమ్, లాజిస్టిక్స్ సర్వీస్…ఇలా ప్రతీ భాగాన్ని విడిగా ఒక సేవగా చేసి…ఈ స్వతంత్ర సేవలన్నీ ఒక ప్రామాణిక ప్రొటొకాల్ పై ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయ్యేలా ఒఎన్‌డిసి చేస్తుంది. పరస్పర సహకార ప్రయత్నాలతో ఈ నెట్ వర్క్ ను మేం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు, గ్రామాలకు తీసుకు వెళ్లాలని భావిస్తున్నాం.స్థానిక విక్రేతలు, ఆంత్రప్రెన్యూర్లకు అంతర్జాతీయ వేదికను అందించడం, అవసరమైన సామర్థ్యాలను కల్పించడం ద్వారా వారికి సాధికారికత కల్పించాలని కోరుకుంటున్నాం. దీంతో వీరు స్థానిక మార్కెట్ అవసరాలను తీర్చడం మాత్రమే గాకుండా జాతీయస్థాయిలోనూ రాణించే అవకాశం ఉంది’’ అని అన్నారు.
భారతదేశ రిటైల్ పరిశ్రమలో ఓఎన్డిసి ఎలాంటి విప్లవం తీసుకురానుందనే అంశంపై ఓఎన్డిసి చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీ శిరీష్ జోషి, యూనికామర్స్ సీఈఓ కపిల్ మకీజా మధ్య జరిగిన సంభాషణ కూడా సదస్సుకు హాజరైన వారిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీ జోషి మాట్లాడుతూ, ‘‘నేడు ఇ-కామర్స్ అనేది ఆరంభం నుంచి చివరి వరకు కలసి ఉన్నసందర్భాల్లో, విక్రేత, కొనుగోలుదారు ఇద్దరూ ఒకే ప్లాట్ ఫామ్ పై నమోదై ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతోంది. ఓఎన్డిసిని మేం ఒక సరళమైన సామర్థ్యంగా రూపొందించాం. ఎన్నో విభిన్న అంశాల సమ్మేళనానికి అది వీలు కల్పిస్తుంది. ఒక్కచోటుకు చేరుకునేందుకు, పరస్పరం ఇంటరాక్ట్ అయ్యేందుకు తోడ్పడుతుంది. ఓఎన్డిసి తో ఇ-కామర్స్ అనేది ముందుగా నిర్వచించబడిన స్థిర పరిష్కారంగా గాకుండా ఒక సరళమైన వ్యవస్థగా మారిపోతుంది. ఇక్కడ కొనుగోలుదారులు, విక్రేతలు తమ అవసరాలకు అనుగుణంగా అనుసంధానమవుతారు. వేర్వేరు బ్యాంకింగ్ చానల్స్ లో ఉన్నప్పటికీ, యూని ఫైడ్ నెట్ వర్క్ పై ఒకరితో ఒకరు లావాదేవీలు నిర్వహిస్తూ, యూపీఐని ఉపయోగించడం ద్వారా చెల్లింపులు జరుగుతున్న తరహాలోనే, ఒఎన్‌డిసి, ఆయా ఇకామర్స్ బ్రాండ్లు, విక్రేతలు మరింతగా ప్రజలను చేరుకునేం దుకు సాధికారికత కల్పించనుంది’’ అని అన్నారు.
ప్రతి సంవత్సరం, ఇ-కామర్స్ విక్రయాలను సరళీకృతం చేయడంలో విక్రేతలకు సహాయం చేసే దృష్టితోSARALని యూనికామర్స్నిర్వహిస్తుంది. SARAL 2022 కార్యక్రమం 1000+ రిటైల్ బ్రాండ్లు,ఇ- కామర్స్ కంపెనీల భాగస్వామ్యాన్ని సాధించింది. 3PL ప్లేయర్‌లు, ఇ-కామర్స్ ఎనేబుల్ చేసేవారు, పర్ఫార్మన్స్ మార్కెటీర్లు, అకౌంటింగ్ కంపెనీలు, WMS ప్రొవైడర్‌లు, మార్కెట్‌ప్లేస్‌లు మరియు రిటైల్ కన్సల్టెంట్‌లు వంటి వివిధ ఇ-కామర్స్ సంబంధిత పరిశ్రమల నుండి వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. సమ్మిట్ గత సంవత్సరంలో బలమైన ఆన్‌లైన్ ఉనికిని కలిగి ఉన్న, మంచి భవిష్యత్తును ప్రదర్శించిన కంపెనీలను గుర్తించి, సత్కరించింది.
బలమైన ఆన్‌లైన్ వ్యాపారాన్ని నిర్మించడంలో గొప్ప షాపింగ్ అనుభవాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సమ్మిట్ వ్యాపారాలకు సహాయపడింది. ఈవెంట్‌కు హాజరైన రిటైలర్‌లు భారతదేశంలోని కొన్ని అతిపెద్ద ఇ-కామర్స్ ఎనేబుల్‌లతో అనుసంధానం అయ్యే అవకాశాన్ని పొందారు, ఇది కొత్త మార్గాలను అన్వేషించడంలో వారికి సహాయపడింది. పటిష్టమైన ఆన్‌లైన్ వ్యాపారాన్ని నిర్మించడం గురించి రిటైల్ బ్రాండ్‌లలో విశ్వాసాన్ని నింపింది.
ఆన్‌లైన్ వ్యాపారాన్ని నిర్మించడంలో డిజిటల్ ఛానెల్‌లలో నూతన తరం మార్కెటింగ్ నుండి పోస్ట్-పాండమిక్ ఇ-కామర్స్ వృద్ధి వరకు అన్ని ప్రముఖ అంశాల గురించి ప్యానెల్ చర్చలు జరిగాయి. ఈవెంట్‌కు హాజరైన రిటైలర్‌లు ఓమ్నిఛానల్ రిటైల్ కోసం టూల్‌కిట్ గురించి, సరఫరా గొలుసులోని డార్క్ స్టోర్‌లను ఎలా ఉపయోగించాలి లాంటి అంశాలతో పాటుగా లాభదాయకమైన D2C వ్యాపారాన్ని ఎలా నిర్మించాలో కూడా తెలుసుకున్నారు. భారతదేశంలోని యువ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి, Gen Z వ్యవస్థాపకులు పటిష్టమైన ఆన్‌లైన్ వ్యాపారాలను ఎలా నిర్మిస్తున్నారనే దానిపై చర్చ జరిగింది.
ఈ కార్యక్రమంసాధించిన విజయంపై యునికామర్స్ సీఈఓ శ్రీ కపిల్ మఖిజా మాట్లాడుతూ, “భారతదేశంలో ప్రముఖ, వర్ధమాన ఇ-కామర్స్ వ్యాపారాలు రెండూ తమ వ్యాపారాలను గణనీయంగా పెంచడానికి సాంకేతికతను ఎలా ఉపయోగించుకుంటున్నాయో ప్రదర్శించడంలో SARAL సహాయపడుతుంది. ఇది ప్రస్తుత ధోరణులు, భవిష్యత్తు పోకడలను పంచుకోవడం ద్వారా అపారమైన అభ్యాస అవకాశాలను అందించడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన వేదిక.గత రెండేళ్లుగా వర్చువల్ ఈవెంట్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చాం.SARAL 2022ని భౌతిక ఈవెంట్‌గా హోస్టింగ్ చేయడం నిర్వహించడం మరింత శక్తిని అందించినట్ల యింది’’ అని అన్నారు.
పోస్ట్-పాండమిక్ యుగంలో ఇ-కామర్స్ వృద్ధి అనేది బ్రాండ్‌లు తమ కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, బ్రాండ్ విధేయతను పెంపొందించడానికి, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం ప్రాముఖ్యతను గ్రహించడానికి దారితీసింది. వ్యాపార రంగం అంతటా ఇకామర్స్ ఊపందుకుంటున్నందున, మార్కెటింగ్, కస్టమర్ సముపార్జన, బ్రాండ్ వెబ్‌సైట్‌లను నిర్మించడం, సరఫరా గొలుసు, చివరి-అంచె డెలివరీ, రిటర్న్ మేనేజ్‌మెంట్ వంటి వ్యాపారం యొక్క వివిధ అంశాలను నిర్వహించడానికి కంపెనీలకు సాంకేతిక ఆధారిత పరిష్కారాలు అవసరం. ప్రతి సంవత్సరం, యూనికామర్స్ ఆయా సంస్థలు తమ ఇ-కామర్స్ కార్యకలాపాలను బలోపేతం చేయడంలో సహాయపడే దృష్టితో SARALని నిర్వహిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం కొనుగోలు అనంతర అనుభవాన్ని మెరుగుపరచడానికి యూనికామర్స్ 15000 బ్రాండ్‌లకు సంసిద్ధతను అందించింది.14 దేశాలలో ఉనికిని కలిగి ఉన్న యూనికామర్స్, అత్యుత్తమ సాంకేతికతతో ఆయా ఇ-కామర్స్ వ్యాపారాలు పనిచేసే విధానాన్ని మారుస్తోంది. కంపెనీ USD 5 బిలియన్ GMV కంటే ఎక్కువ మొత్తంలో 500 మిలియన్ల వార్షిక లావాదేవీలతో భారతదేశ ఇ-కామర్స్ వాల్యూమ్‌లలో 20% పైగా ప్రాసెస్ చేస్తుంది.