తబుల సంగీతానికి ఐదేళ్లు

మానవ మనస్సు ఓ ఖాళీ పలక లాంటిందనే లాటిన్‌ తత్త్వం – తబుల రస; 2017 నుంచి నగరవాసుల అభిమాన ఓపెన్‌ ఎయిర్‌ బార్‌గా వెలుగొందుతూనే ఈ సిద్ధాంతాన్ని అపూర్వంగా అన్వేషించే అవకాశం కల్పిస్తోన్న తబుల రస ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

నగర సాంస్కృతిక రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న తబుల రస కేవలం 15 మంది సిబ్బందితో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. అందరినీ కలుపుకుని పోతూ అవకాశాల ప్రాంగణంగా మారాలనే తమ కలను సాకారం చేసుకుంటూ ఇప్పుడు 75 మందితో కూడిన సిబ్బందితో అత్యంత అందమైన, నగరంలో ఓ బలమైన సాంస్కృతిక కేంద్రానికి ఏ మాత్రం తక్కువ కాదన్న రీతిలో రూపుదిద్దుకుంది. సంగీత పరంగా మాత్రమే కాదు ఇతర అంశాల పరంగా కూడా ఇది మహోన్నత కేంద్రంగా వెలుగొందుతుంది.

మహేంద్రజాలానికి శక్తివంతమైన రూపం సంగీతం అని అంటుంటారు. తబుల రస వద్ద, సంగీత ప్రేమికులు ఆ ఇంద్రజాలాన్ని అత్యున్నతంగా ఆస్వాదించగలరు. ఇక్కడ డజన్ల కొద్దీ కళాకారులు తమ మహోన్నత కళాత్మకతను ప్రదర్శిస్తున్నారు. సంగీతంలో ఓదార్పును కోరుకునే వారి కోసం, బ్లూస్‌, జాజ్‌, ఎకౌస్టిక్‌ మెటల్‌, క్లాసిక్‌ రాక్‌, పాప్‌, ప్రాంతీయ సంగీతం, టెక్నో మరియు లైవ్‌ ఎలకా్ట్రనికా సహా విభిన్న శైలిల సంగీతానికి నక్షత్రాల మెరుపులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆకాశం కింద 2400 చదరపు అడుగుల ప్రాంగణంలో ఆతిథ్యమిస్తుంది.

తబుల రస యొక్క సంగీతం, సంస్కృతి, నోరూరించే మెనూ యువతరం నుంచి ఫ్యామిలీల వరకూ ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇక్కడ నిర్వహించే ఫ్లియా మార్కెట్‌లు, సిప్‌ మరియు పెయింట్స్‌ కార్యక్రమాలకు ప్రత్యేక అభిమానులూ ఉన్నారు మరియు నగరంలో లైవ్‌ మ్యూజిక్‌ వాతావరణాన్ని సమూలంగా మార్చడానికి ఉన్న అవకాశాలను అన్వేషిస్తూనే ఉంది. ఈ ఒక్క సంవత్సరంలోనే ఇక్కడ 200కు పైగా లైవ్‌ బ్యాండ్స్‌ తో పాటుగా జాతీయ మరియు అంతర్జాతీయ డీజెల ప్రదర్శనలనూ ఏర్పాటుచేశారు. ఈ వైభవాన్ని వేడుక చేయడంలో భాగంగా, తబులా ఇప్పుడు వార్షికోత్సవ వారాన్ని నిర్వహించబోతుంది. ఈ ఏడు రోజుల పలూజ సిప్‌ అండ్‌ పెయింట్‌ సెషన్‌తో పాటుగా ట్రేడ్‌మార్క్‌ సండే ప్లే గ్రౌండ్‌ను 21 ఆగస్టు 2022న నిర్వహించడంతో ప్రారంభించారు. దీనిని అనుసరించి వ్యవస్థాపకుని అభిమాన బ్యాండ్స్‌ మరియు ఆర్టిస్ట్‌లు – ఎల్‌ టాక్సిడీ, ఐక్యం, అరోహీ, నిరావల్‌ , వర్ణం, దక్కన్‌ ప్రాజెక్ట్‌ వంటివి ఆగస్టు 27వ తరగతి వరకూ ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు తమ ప్రదర్శనలివ్వనున్నాయి. ఈ వేడుకల ముగింపు కార్యక్రమం ఆగస్టు 28వ తేదీ జరుగనుంది. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలు మధ్యాహ్నం పూట లిజనింగ్‌ పార్టీ, అక్లాడ్‌ అహ్మద్‌, ఇబెరియన్‌ మ్యూజ్‌ను సాయంత్రం నిర్వహించనున్నారు. అలాగని ఈ వేడుకలు ఇక్కడతో ముగియవు మరియు దీనిని అనుసరించి రాబోయే నెలలో రస ఫెస్టివల్‌ 18 సెప్టెంబర్‌న ముగియనుంది.

ఈ ఐదవ వార్షికోత్సవ సందర్భంగా శ్రావణ్‌ జువ్వాడి – తబుల రస వ్యవస్థాపకులు మాట్లాడుతూ ‘‘ఐదేళ్ల క్రితం మేము తబుల రస ప్రారంభించినప్పుడు , హైదరాబాద్‌లో ఇండి మ్యూజిక్‌ వాతావరణం ప్రారంభ దశలోనే ఉంది. అభివృద్ధి చెందుతున్న బ్యాండ్స్‌తో పాటుగా కళాకారులకు తగిన వేదికనందించాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తించడంతో పాటుగా దానినే మేము చేస్తున్నాము. ఉదాహరణకు తెలుగు సంగీతోత్సవం –రస. ఇది ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి రావడానికి కారణమైంది. వీరిలో కొంతమంది సుప్రసిద్ధ తెలుగు బ్యాండ్స్‌ అయినటువంటి నిరావల్‌, ఎల్జియం మొదలైన వాటిలో భాగమయ్యారు. అత్యుత్తమ ఆడియో –విజువల్‌ అనుభవాలు, మెరుగైన శబ్ద నాణ్యత, అత్యాధునిక మౌలిక సదుపాయాల కోసం తాము చూపిన శ్రద్ధ కారణంగానే ఈ రోజు ఈ స్ధానానికి చేరుకున్నాము. మా రస్టిక్‌ నేపథ్య వాతావరణం, కాంక్రీట్‌ జంగిల్‌లో ఒయాసిస్‌లా పచ్చదనం పరిఢవిల్లేలా ప్రకృతి అందాలు ప్రజలను ప్రకృతికి, ఆ ప్రకృతితో మమేకమైన సంగీతానికి దగ్గర చేశాయి. నేను ఈ ప్రాంగణాన్ని పేరుకు తగ్గ రీతిలోనే ప్రారంభించాను. గత 10 సంవత్సరాలుగా ఆతిథ్య రంగ వ్యాపారంలో ఉన్న నేను, బంధానికి సంబంధించిన అంశమే ఆతిథ్యమని గట్టిగా నమ్ముతుంటాను. సంగీతం అనే అత్యంత అందమైన రూపంతో మీతో బంధం ఏర్పడినందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. తబుల రస అనేది కేవలం ఓ బార్‌ మాత్రమే కాదు అది ఓ భావోద్వేగమనిపించేలా నన్ను మార్చారు. నా అభిరుచి, నా కృషి మరియు నాకు మద్దతునందించిన మ అందరికీ ధన్యవాదములు. ఎప్పటికీ మీకు ఋణపడి ఉంటాను. నిజంగా ఇది చాలా గర్వించతగ్గ అంశం!

మా 5వ వార్షికోత్సవ సందర్భంగా, మా తరువాత ప్రోపర్టీని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ప్రారంభించబోతున్నామని వెల్లడించేందుకు సంతోషిస్తున్నాను. దీనిని 1800 చదరపు గజాల స్ధలంలో జనవరిలో ప్రారంభించనున్నాము’’ అని అన్నారు.