సీఎంకు దమ్ము ఉంటే అత్యాచార కేసులపై దృష్టి పెట్టాలి
భారతీయ జనతాపార్టీని లక్ష్యంగా చేసుకొని సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరుపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మహిళా నాయకురాలు కొల్లి మాధవి మండిపడ్డారు. రాష్ట్రంలో ఫ్రెండ్లిపోలీసింగ్ వ్యవస్థ అని గొప్పలు చెప్పుకున్న సీఎంకు ఖాకీ బట్టలు వేసుకొని కామవాంఛాలు తీర్చుకుంటున్న వారు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజుకో పోలీస్ రాసలీలు బయటపడుతుంటే… మహిళా న్యాయం కోసం ఎలా పోలీసుల దగ్గరకు వెళ్తారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. తప్పులను పక్కదోవ పట్టించడానికే సీఎం ప్రెస్‌మీట్ పెట్టి తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. తాటాకు చప్పులకు ఎవ్వరూ బయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆమె. తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి మహిళల కోసం ప్రత్యేక విధానాలు అమలు పరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పాలన గాలికొదిలేసి ప్రజాధనం దండుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారని అన్నారు. అవినీతి సొమ్మును కాపాడుకోవాడానికి అధికారం కావాలి కాబట్టి సీఎం పదవి కోసం తపనపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మైనార్ బాలిక అత్యాచార కేసులు, కామ పోలీసుల కేసులపై దృష్టి పెట్టి బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.