పార్టీకి నష్టమని తెలిసిన కాంగ్రెస్ త్యాగం చేసింది: రాహుల్ గాంధీ
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నేరవేర్చడానికి తన కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసిందన్నారు ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ. అమరవీరుల త్యాగాలతో పాటు, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేసిందని వరంగల్ సభలో రాహుల్ తెలిపారు. అమరుల సమాధుల మీద టీఆర్ఎస్ పార్టీ పీఠం వేసుకొని కూర్చుదని విమర్శించారు. ఈ సభలో అధికార పార్టీ తెరాస మీద తనదైన శైలిలో మండిపడ్డారు ఆయన.
ఇక రైతుల ఆత్మహత్యల మీద భాజాపా, తెరాస ద్వంద నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. మోదీ రైతు చట్టాలను తీసుకువచ్చినప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని అన్నారు. అందుకే రైతు చట్టాలకు మద్దతు ఇచ్చిందని వెల్లడించారు. తెలంగాణలో గెలవలేం కాబట్టే బీజేపీ రిమోట్ కంట్రోల్ తో పాలిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తాము చెప్పినట్టు ఆడే టీఆర్ఎస్ సర్కారే ఉండాలని బీజేపీ కోరుకుంటోందని తెలిపారు. టీఆర్ఎస్ ఎంత దోచుకున్నా ఈడీ, ఐటీలు ఇక్కడికి రావని అన్నారు.