అత్యాచారాల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా మారుతోంది : అనిత‌

ఒక‌ప్పుడు స‌స్య‌శామలంగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఇప్పుడు అత్యాచారాలు, హ‌త్యంధ్ర‌ప్ర‌దేశ్‌గా మారుతోంద‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్యక్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. వైకాపా అధికారంలోకి వ‌చ్చన‌ప్ప‌టి నుండి రౌడీలు చెల‌రేగిపోతున్నార‌ని అన్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త కరువైంద‌న్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా మ‌హిళ ఉన్నా… ఏమాత్రం అవ‌గాహ‌న లేకుండా ఉన్నార‌ని ఆరోపించారు. ఒక‌టి కాదు రెండు కాదు నిత్యం రాష్ట్రంలో ఎదో ఒక చోట స్త్రీలు అత్యాచారానికి గురువుతున్నార‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై రాష్ట్ర మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించార‌ని పేర్కొన్నారు. ఇప్పుడు ఇంట్లో నుండి మ‌హిళ బ‌య‌ట‌కు రావ‌లంటే భ‌య‌ప‌డుతున్నార‌ని అన్నారు.