సికింద్రాబాద్‌లో మొట్టమొదటి స్టూడియో ప్రారంభించిన పెప్పర్‌ఫ్రై
భారతదేశపు నెంబర్ 1 ఫర్నిచర్, గృహ ఉత్పత్తుల మార్కెట్ ప్రాంగణం పెప్పర్‌ఫ్రై , తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో తమ మొదటి స్టూడియో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ఆఫ్‌లైన్ విస్తరణ, సముచిత మార్కెట్‌లలో విస్తరించడంతో పాటుగా భారతదేశంలో ఫర్నిచర్ మరియు గృహ ఉత్పత్తుల విభాగంలో అతిపెద్ద ఓమ్నీ ఛానెల్ వ్యాపారాన్ని సృష్టించాలనే కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. 2014లో తమ మొదటి స్టూడియోను పెప్పర్‌ఫ్రై ప్రారంభించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 50కు పైగా నగరాలలో 100కు పైగా స్టూడియోలు సంస్థకు ఉన్నాయి. దక్షిణ భారతదేశం, పెప్పర్ ఫ్రైకు అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తుంది. ఇక్కడే 45కు పైగా స్టూడియోలు సంస్థకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మంగళూరు, కొచి, మధురై, వెల్లూరు, సేలం, గుల్బర్గా, చిత్తూరు, చేర్తల, మంగళూరు, ఎరోడ్, తిరువల్ల, త్రిచి, కొల్లామ్, విజయవాడ, విశాఖపట్నం, కోజికోడ్, వరంగల్, కొట్టాయం, మరియు ఇప్పుడు సికింద్రాబాద్‌లో ఉన్నాయి.
ఈ స్టూడియోను ఏస్క్వేర్ ఎంటర్‌ప్రైజస్ భాగస్వామ్యంతో ప్రారంభించారు. సికింద్రాబాద్‌లోని అత్యంత కీలకమైన వాణిజ్య ప్రాంతం తిరుమలగిరి వద్ద ఇది 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది వినియోగదారులకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన శ్రేణి ఫర్నిచర్, డెకార్ తొలి అనుభవాలను అందిస్తుంది. పెప్పర్ ఫ్రై వెబ్‌సైట్‌పై అందుబాటులో ఉన్న ఒక లక్ష ఉత్పత్తుల నుంచి ఎంపిక చేసిన వైవిధ్యమైన ఉత్పత్తుల జాబితాను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ స్టూడియోలు వినియోగదారులకు టచ్ అండ్ ఫీల్ అనుభూతులను అందించడంతో పాటుగా ఉడ్ ఫినీషెస్‌ను అర్థం చేసుకోవడం, కొనుగోలు చేయక మునుపే ఈ భారీ వస్తువుల నాణ్యతను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఈ స్టూడియోలో డిజైన్ నిపుణులు కూడా ఉండటం వల్ల , కాంప్లిమెంటరీ డిజైన్ కన్సల్టెన్సీని సైతం అందించచ్చు. తద్వారా వినియోగదారులు తమ కలల ఇంటిని సృష్టించుకోవచ్చు.
తమ ఓమ్నీఛానెల్ నెట్‌వర్క్‌పై రూపొందించిన వినూత్నమైన ఫ్రాంచైజీ మోడల్‌ను 2017లో పెప్పర్ ఫ్రై పరిచయం చేసింది. అతి తక్కువ కాలంలోనే వీరు 85 ఫోఫో స్టూడియోలను మెట్రోలు, టియర్ 2, టియర్ 3 మార్కెట్‌లు అయినటువంటి పఠాన్‌కోట్, త్రివేండ్రం, పాట్నా, బెంగళూరు, ఇండోర్, చెన్నై, గౌహతి, కోయంబత్తూరు లో ప్రారంభించింది. ఈ ఫ్రాంచైజీ స్టూడియోల కోసం , పెప్పర్ ఫ్రై ఆ ప్రాంతాలలో అత్యుత్తమ స్థానిక వ్యాపారులతో భాగస్వామ్యం చేసుకోవాలని నిర్ణయించుకుంది. హైపర్ లోకల్ డిమాండ్, ధోరణుల పట్ల వీరికి పూర్తి అవగాహన ఉంది. ఈ కంపెనీ తమ ఫ్రాంచైజీ మోడల్‌ను 2020లో పునరుద్ధరించడంతో పాటుగా ప్రస్తుత, సంభావ్య భాగస్వాములకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు ఇది రివార్డులను అందిస్తుంది. దీనిలో భాగంగా ఫ్రాంచైజీ యజమానులు 15% కమీషన్‌ను (గతంలో 10% ఉండేది) ఫ్రాంచైజీ స్టూడియో ద్వారా చేసే ప్రతి ఆన్‌లైన్ లావాదేవీపై పొందవచ్చు.
పెప్పర్ ఫ్రై తమ పెప్పర్ ఫ్రై యాక్సలరేటర్ కార్యక్రమాన్ని జూన్ 2021లో ప్రారంభించింది. దీనిద్వారా ఒక సంవత్సరంలో 200కు పైగా స్టూడియోలను ఒక సంవత్సరంలో ప్రారంభించాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నూతనంగా తీర్చిదిద్దిన కార్యక్రమ ముఖ్య లక్ష్యం, పెప్పర్ ఫ్రై యొక్క ఆఫ్‌లైన్ పాదముద్రికలను గణనీయంగా విస్తరించడం. రోజుకు ఓ వ్యాపారవేత్తను సంవత్సరంలో మిగిలిన రోజులు జోడించడం దీని లక్ష్యం. అయితే, ఈ నూతన కార్యక్రమంలో అతిపెద్ద వైవిధ్యత ఏమిటంటే, ఫ్రాంచైజీ భాగస్వాములకు కాపెక్స్ అవసరం పడటం. అది దాదాపుగా 15లక్షల రూపాయలు ఉంటుంది. ప్రస్తుత ఫ్రాంచైజీ ప్రోగ్రామ్‌తో పోలిస్తే అది మూడోవంతు మాత్రమే !
ఈ రెండు నమూనాలూ 100% ప్రైస్ పారిటీ ఆధారంగా ఉంటాయి మరియు ప్రొడక్ట్ ఇన్వెంటరీ పెట్టుకోవాల్సిన అవసరం భాగస్వామికి ఉండదు. ఇది పరస్పర ప్రయోజనకరమైన వ్యాపార భాగస్వామ్యంగా నిలుస్తుంది.
ఈ స్టూడియోప్రారంభం గురించి పెప్పర్ ఫ్రై బిజినెస్ హెడ్, అమృత గుప్తా మాట్లాడుతూ ‘‘ ఏ స్క్వేర్ ఎంటర్‌ప్రైజస్ తో భాగస్వామ్యం చేసుకుని సికింద్రాబాద్‌లో మా మొదటి స్టూడియోను ప్రారంభించడం ద్వారా మా ఓమ్నీ ఛానెల్ కార్యకలాపాలను విస్తరించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. పెప్పర్ ఫ్రై వద్ద, మా లక్ష్యమెప్పుడూ కూడా వీలైనన్ని మార్గాలలో మా వినియోగదారులకు చేరువకావడంతో పాటుగా అత్యుత్తమ ధరల వద్ద అసాధారణ వెరైటీలను అందించడం. అందువల్ల, ప్రస్తుత సమయంలో, తమ గృహ వాతావరణం పట్ల వ్యక్తులు మరింత ఆప్రమప్తతతో వ్యవహరిస్తున్నారు. పనితీరు పరంగా మెరుగ్గా ఉండటంతో పాటుగా చూడగానే ఆకట్టుకునే రీతిలో ఉండే ప్రాంగణాలను సృష్టించడానికి వారు పెట్టుబడులు పెడుతున్నారు. చక్కటి గృహాలను సృష్టించడంలో మా స్టూడియోలు వినియోగదారులకు తోడ్పడగలవని మేము నమ్మతున్నాము’’ అని అన్నారు.
ఏస్క్వేర్ ఎంటర్‌ప్రైజస్ యజమాని నాగేందర్ రాజు మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో సుప్రసిద్ధ హోమ్, ఫర్నిచర్ మార్కెట్ ప్రాంగణంతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. పూర్తి వైవిధ్యమైన ఓమ్నీ ఛానెల్ వ్యాపారం పెప్పర్ ఫ్రై. అతి పెద్ద ఓమ్నీఛానెల్ గృహ, ఫర్నిచర్ వ్యాపారం సృష్టించాలనే వారి ప్రయాణంలో చేరడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.