ఎంపీ అర్వింద్‌కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వారెంట్‌ జారీ చేశారు. కేసు విచారణకు హాజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు వారెంట్‌ జారీ చేసింది. 2020 నవంబర్‌ 23న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అర్వింద్‌పై కేసు నమోదు చేశారు. టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు ధ్వంసం చేశారని, టీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పీఎస్‌లో అర్వింద్‌పై కేసు నమోదైంది. ఈ కేసుపై పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. విచారణను కోర్టు ప్రారంభించింది. అయితే ఆ కేసు విచారణ సందర్భంగా అర్వింద్ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఆయనకు కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ చేసింది. ఈ కేసు విచారణ ఈనెల 28కి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు వాయిదా వేసింది.