రెపోస్ ఎనర్జీతో భాగస్వామ్యం చేసుకున్న మహీంద్రా
మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీ) ఇప్పుడు రెపోస్ ఎనర్జీతో భాగస్వామ్యం చేసుకుని ఇంటి ముంగిటనే ఇంధన డెలివరీ డిమాండ్‌ను రెడీమేడ్ ఫ్యూయల్ బ్రౌజర్ ట్రక్స్ ద్వారా తీర్చనుంది. ఈ డోర్‌స్టెప్ ఫ్యూయల్ డెలివరీ మోడల్ అత్యంత వేగంగా భారతదేశ వ్యాప్తంగా వృద్ధి చెందడంతో పాటుగా కోవిడ్ అనంతర కాలంలో మరింత వేగంగా విస్తరిస్తోంది. దీనికి బహుళ కారణాలు ఉన్నాయి. వాటిలో అంతర్జాతీయ సరఫరా చైన్, ఇంధన వాణిజ్య ఆర్థికాంశాలు, ప్రస్తుత పంపిణీ నమూనాలో నిర్మాణాత్మక అవరోధాలు , మారుతున్న వినియోగదారుల కొనుగోలు ప్రవర్తన మరియు సాంకేతిక ఆటంకాలు కారణం.
ఈ సందర్భంగా చేతన్ వాల్నజ్, కో–ఫౌండర్, రెపోస్ ఎనర్జీ మాట్లాడుతూ ‘‘ప్రపంచం మొత్తం మొబైల్‌కు మళ్లడంతో పాటుగా వస్తువులను అతి సులభంగా పొందేందుకు ప్రయత్నిస్తోన్న వేళ, భారతదేశంలో ఇంటి ముంగిటనే డీజిల్‌డెలివరీ ద్వారా దేశంలో ఇంధన పంపిణీ విధానం మరింత సులభతరం అవుతుంది. మొబైల్ పెట్రోల్ పంపుల ద్వారా డీజిల్‌ను చక్రాలపైకి తీసుకురావడమనేది మా ప్రధాన విజయాలలో ఒకటిగా నిలుస్తుంది. ఫ్యూయల్ బ్రౌజర్ అప్లికేషన్ కోసం మహీంద్రాఫ్యూరియో అందించే ఉత్పత్తి శ్రేష్టత మరియు అనుకూలతతో భారతదేశ వ్యాప్తంగా ప్రతి మూలనూ మేము చేరుకోవాలనుకుంటున్నాము మరియు భవిష్యత్‌లో అన్ని రకాల ఇంధన పంపిణీ పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనుకుంటున్నాము. మా ఫ్యూయల్ బ్రౌజర్ యూనిట్‌లో డబుల్ డిస్పెన్సింగ్ యూనిట్లు, పవర్ టేక్ ఆఫ్ యూనిట్, స్మార్ట్ ఫ్యూయల్ లెవల్ సెన్సార్లు, బ్రేక్ ఇంటర్‌లాక్ మెకానిజం, రిమోట్ థ్రోటెల్, ఇంటిలిజెంట్ జియోఫెన్సింగ్ మరియు అతి సులభంగా వినియోగించే రెపోస్ యాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి’’ అని అన్నారు.
ఈ సందర్భంగా జలజ్ గుప్తా, బిజినెస్ హెడ్ – కమర్షియల్ వాహనాలు, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘డీజిల్‌లో అధిక శాతం గనులు, మౌలిక వసతులు, రియల్ ఎస్టేట్, ఆతిథ్యం మొదలైన పరిశ్రమలకు శక్తినందించడానికే వినియోగిస్తున్నారు. ఈ రంగాలలో డీజిల్ అధికంగా వినియోగించాల్సి వస్తుంది. ఈ పరిశ్రమలు సాధారణంగా ఈ డీజిల్‌ను ఫ్యూయల్ పంప్స్ వద్ద సరికాని గ్రాహకాలైన బారెల్స్‌లో నింపుకుంటుంటాయి. దీనివల్ల ఇంధనం చిందడం, దొంగతనం జరగడం, మైలేజీ తగ్గిపోవడం, మానవశక్తి ఖర్చు రూపంలో భారీ నష్టాలు ఎదురవుతుంటాయి. ఫ్యూయల్ బ్రౌజర్ పరిష్కారాలలో రెపోస్ ఎనర్జీ నైపుణ్యంతో మేము మహోన్నత ఉత్పత్తి ఆఫరింగ్ అందిస్తున్నాము. ఇది వృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాలను తీర్చడంతో పాటుగా జాతి నిర్మాణంలో మా వంతు పాత్ర పోషించేందుకు తోడ్పడుతుంది. మహీంద్రా శ్రేణి తేలిక పాటి మరియు మధ్య తరహా వాణిజ్య వాహనాలు తమవైన స్వాభావిక ప్రయోజనాలతో వస్తాయి. ఫ్యూయల్ బ్రౌజర్ కార్యకలాలతో పాటుగా లాభదాయకతకు భరోసా అందించేందుకు ఇది చక్కగా సరిపోతుంది.
ఖచ్చితంగా అత్యధిక మైలేజీని మహీంద్రా ఫ్యూరియో అందించడంతో పాటుగా ఇతర ఉత్పత్తి శ్రేష్టతలైనటువంటి ఒద్దికైన వాహన నిర్మాణం, మెరుగైన వాహన స్థిరత్వం కోసం బలమైన మరియు రగ్డ్ యాగ్రిగేట్స్, నగరం లోపల డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా అతి తక్కువ టర్నింగ్ సర్కిల్ డయామీటర్, అత్యున్నత క్యాబిన్ సౌకర్యం ఉన్నాయి. అత్యుత్తమ వాహన స్థిరత్వం కోసం స్టాండర్డ్ ఫ్రంట్ యాంటీ రోల్‌బార్ ఉంది. ఐమ్యాక్స్ ఇంటిలిజెంట్ టెలిమ్యాట్రిక్స్ టెక్నాలజీ ద్వారా వాహనాన్ని ఎక్కడ నుంచైనా ట్రాక్‌చేయవచ్చు మరియు రవాణాను మరింత సమర్థవంతంగా, లాభదాయకంగా మార్చవచ్చు’’ అని అన్నారు.