ఈటల అంటే కేసీఆర్‌కి వణుకు పుడుతోందా ?
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అంటే సీఎం కేసీఆర్‌లో భయం మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ నుండి ముగ్గురు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఇది కేసీఆర్ భయపడి పక్కా ప్లాన్‌తో చేశారని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక అసెంబ్లీ భేటీ ఆరంభం కాగానే అందరి దృష్టీ కేసీఆర్,ఈటలపైనే ఉంది. కానీ రాజకీయ విశ్లేషకుల అనుమానమే నిజమైంది.ఈటల రాజేందర్ విసిరే మాటల ఈటెలను తట్టుకునే ధైర్యం అధికార పక్షంలో లేదని బీజేపీ సభ్యుల సస్పెన్షన్ తో తేలిపోయింది. పైగా అమ్మ పుట్టింటి సంగతి మేనమామకు ఎరుక అని సామెత.అదే ప్రకారం టీఆర్ఎస్ సర్కార్ ఏడేళ్లు లొసుగులు.. ఈటలకంటే బాగా ఇంకెవరికి తెలుస్తాయ్..అందుకే ఈటల అసెంబ్లీలో ఒక్కక్షణం ఉన్నా..గులాబీ బాస్ సహా కేటీఆర్, హరీష్ వంటి వారందరికీ దడదడ అనేది బీజేపీ వర్గాల వాదన.
ఒకవైపు రైతుల ఆత్మహత్యలు,మనదైన రాష్ట్రం వచ్చినా ఇంకా ఉపాధి కరవైందంటూ నిరాశతో తనువు చాలిస్తున్ననిరుద్యోగులు..మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్నఅత్యాచారాలు,317 వంటి జీవోలతో జీవచ్ఛవాల్లా మారిన ఉద్యోగులు..ఇక విద్యార్థులకు అడుగడుగునా సమస్యలు.ఇలా ఏ రంగం చూసినా కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు..వీటిపై నిలదీసేందుకు ఈటలతో పాటు రఘునందన్,రాజాసింగ్ గట్టిగానే ప్రిపేర్ అయి వచ్చినట్టు సమాచారం.
అటు..కాళేశ్వరం అవినీతిపై ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డానే ఛాలెంజ్ చేయటంతో..దానిపైనా బీజేపీ చర్చకు పట్టుబట్టే అవకాశాలను టీఆర్ఎస్ సర్కార్ ఊహించింది.అంతేగాకుండా ఇటీవల ఐఏఎస్ రజత్ కుమార్ మ్యారేజ్ గేట్ కుంభకోణం..ఇలా వివిధ అంశాల్లో ఇరుకునపడే అవకాశం ఉన్నందునే బీజేపీ సభ్యులను ఎదుర్కొనే దమ్ము లేకే ఈ పని చేశారని కమలనాథులు ఆరోపిస్తున్నారు.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా స్వయంగా కేసీఆరే రంగంలోకి దిగినా..వందల కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చుపెట్టినా..దళిత బంధు వంటి పతకాలు ప్రవేశపెట్టి దళితులకు న్యాయం చేయలేక దగా చేసినా..ఈటల గెలుపును అడ్డుకోలేకపోవటంతో సారుకు ఈటల తన ముందు అసెంబ్లీలో కనబడతాడంటేనే ఒళ్లంతా కంపరమెత్తినట్టుగా ఉందనేది రాజకీయ పండితుల అంచనా. అసెంబ్లీ స్టార్ట్ కాగానే ఈటల సహా మిగతావారి సస్పెన్షన్ కు అది కూడా ఒక కారణమనేది విశ్లేషకుల భావన.
ఇవన్నీఇలా ఉంటే..కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించటం..తమ పథకాలుగా ప్రచారం చేసుకోవటం, మీడియా ముందు కేంద్రంపై నిందలు వేయటం వంటి అంశాలపై కూడా బీజేపీ సభ్యులు కాస్త గట్టిగానే లెక్కలు వేసుకుని వచ్చినట్టు సమాచారం.
ఏదిఏమైనా..పాపం బీజేపీ అంటే భయం వల్లే కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని కమలం పార్టీ వర్గాలు చెప్తున్నాయి.ముగ్గురు ఎమ్మెల్యేలనే తట్టుకోలేని కేసీఆర్..దేశ రాజకీయాల్లో ఏం చక్రం తిప్పుతాడంటూ ఎద్దేవ చేస్తున్నారు.