జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉండండి : డా. వసీం
జంక్ ఫుడ్స్ దూరంగా ఉంటేనే ఊబకాయాన్ని అరికట్టగలుగుతామన్నారు కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలుకు చెందిన ప్రముఖ ఒబెసిటీ మరియు జనరల్ సర్జన్ డాక్టర్ వసీం హాసన్ రాజా షేక్. శుక్రవారం అంతర్జాతీయ ఊబకాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమై రాజ్ విహార్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ వసీం మాట్లాడారు. మారుతున్న జీవన శైలిలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ప్రతి ఇంట్లో పిల్లలు జంక్ పుడ్‌కి అలవాటు పడుతున్నారు. దీంతో చిన్నప్పటి నుండే ఆరోగ్య సమస్యలు, అధిక బరువు వంటివి తతెత్తున్నాయి.ఈ ఊబకాయం ఉన్న వారి సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగునుంది. కాబట్టి మనం తీసుకో ఆహార పదర్ధాలకు ఖచ్చితమైన ఆవగాహన ఉండాలి. ప్రతి రోజు అరగంట పాటు తప్పని సరిగా వ్యాయామం చేయాలన్నారు. వేపుళ్లు, అధికంగా నూనే వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలను తీసుకోవద్దని సూచించారు. ప్రపంచం మొత్తం మీద సిగరెట్లు తాగడం వల్ల చనిపోయేవారికన్నా, ఒబేసిటీ వల్ల వచ్చే సమస్యలతో చనిపోయేవారు సంఖ్య నాలుగు రేట్లు ఎక్కువని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ వాళ్ళు చెబుతున్నారు. అమెరికా లాంటి సంపన్న దేశాల్లో 40% పైగా ఒబెసిటీ తో బాధపడుతుంటే, మనలాంటి ఇంకా అభివ్ద్రుది చెందుతున్న దేశాల్లో కూడా ఈ సమస్య వేగంగా పెరుగుతోంది, ముఖ్యంగా పిల్లలు యువతరంలో ఈ సమస్య అధికంగా ఉంది.
ర్యాలీ రాజ్‌వీహార్ చౌరస్తాకు చేరుకున్న తర్వాత ఊబకాయం మీద ప్రజలకు అవగాహాన కల్పించారు. ఎటువంటి లక్షణాలు ఉంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. కొద్దిదూరం నడవగానే అలసిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన ఆయాసం వస్తుంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని సూచించారు. అధికమైన కొవ్వు పదర్థాలు తీసుకోవద్దన్నారు. ఉదయం పూట తప్పకుండా అల్పహారం తీసుకోవాలన్నారు. ఊబకాయానికి కూడా ఇప్పుడు శస్త్రచికిత్సలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముందుస్తుగా ఊబకాయాన్ని గుర్తించి చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలను వస్తాయన్నారు. ఈ ర్యాలీలో నర్సింగ్ సిబ్బంది ఆహారపు అలావాట్లపై ప్లకార్డుల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ విభాగానికి చెందిన రావి శ్రీనివాస్, శివరామకృష్ణ, బాపయ్య, నర్సింగ్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.