తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తేల్చేసిన తెరాస ఎమ్మెల్యే
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవన్నారు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లి పనులు చక్కబెడుతున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తమ సర్కార్‌కి తీవ్ర అడ్డంకులు సృష్టిస్తోందని… ఇవి తప్పించుకోవాలంటే తప్పకుండా ముందుస్తు ఎన్నికలకు వెళ్లక తప్పడం లేదని తెలిపారు. ఎన్నికలను ఎదుర్కోవాలంటే పార్టీ బలోపేతం కావాల్సి ఉందని పేర్కొన్న ఆయన ఈనెల 8న వనపర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి గ్రామం నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ముందస్తు ఎన్నికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి.