సీఎంను కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్న కేటీఆర్ : బండి సంజ‌య్‌

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. కేసీఆర్‌కి ఇంటి పోరు ఎక్కువైంద‌న్నారు. తెలంగాణ‌కు సీఎం చేయాల‌ని కేటీఆర్ త‌న తండ్రిపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువ‌స్తున్నార‌ని ఆరోపించారు. అందుకే కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లి కొడుకు సీఎం పీఠం ఎక్కించే ప‌నిలో ఉన్నార‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని మోడీ, భాజ‌పా మీద వ్య‌తిరేక నినాదం ఎత్తుకున్నార‌ని అన్నారు. ఎన్ని డ్రామాలు చేసిన‌.. ఎన్ని కుట్ర‌లు చేసినా… ఎంత మంది క‌లిసిన కేంద్రంలో భాజ‌పాని క‌దిలించ‌లేర‌ని తెలిపారు బండి సంజ‌య్‌.