ఆకస్మిక తనిఖీలు చేసిన బోయ గిరిజమ్మ
అనంతపురం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములోని వివిధ సెక్షన్ల యందు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఇటీవల కొంతమంది ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని వచ్చిన ఫిర్యాదుతో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు సెక్షన్‌లలో పలు రికార్డులను పరిశీలించి, కార్యాలయ సిబ్బంది అందరూ సమయపాలన పాటించి, తమ విధులను సమర్థవంతంగా నిర్వహించవలసినదిగా ఆదేశించారు. అలాగే అవసరమైన మేరకు మరమ్మత్తులు చేపట్టుటకు కార్యాలయ భవనాలను పరిశీలించారు. ఈ ఆకస్మిక తనిఖీలో జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్య నిర్వహణాధికారి శ్రీ ఉన్నారు.