మోకాళ్లు, కీళ్ల సమస్యలను తేలికగా తీసుకోవద్దు : డాక్టర్ మహమ్మద్ ఏజాజుద్దీన్
మోకాళ్లు, కీళ్ల సమస్యలను తేలికగా తీసుకోవద్దన్నారు కిమ్స్ హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిషన్
డాక్టర్ మహమ్మద్ ఏజాజుద్దీన్. ఆదివారం లక్టీకాపూల్‌లో యుక్త వయసులో మోకాళ్ల నొప్పులు, పెద్దవారిలో భుజం నొప్పులు అనే అంశం మీద అవగాహాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాని నగరంలోని ప్రముఖ ఫిజియోథెరపిస్టులు పాల్గొన్నారు. యుక్త వయసులో వచ్చే మోకాళ్ల నొప్పులు, క్రీడలు ఆడుతున్న సమయంలో తగిలిన గాయలకు ఎటువంటి చికిత్సలు అందించాలి, ఒకవేళ శస్త్రచికత్సలు చేసిన తరువాత చేయాల్సిన వ్యాయామాల గురించి ఆయన వివరించారు. లక్టీకాపూల్‌కి చెందిన డాక్టర్ దివ్య మాట్లాడుతూ ఏజాజుద్దీన్ తెలిపిన విషయాలు ఎంతో ఉపయోగపడేవన్నారు.











