MG మోటార్ యొక్క సరికొత్త ZS EV, 10.1” HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు
ఈ విభాగంలో మొట్టమొదటిసారి ఆండ్రాయిడ్ మరియు Apple CarPlay కనెక్టివిటీతో వస్తుంది.
గుర్గావ్, 18 ఫిబ్రవరి 2022: అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న MG మోటార్ యొక్క ఆల్-న్యూ ZS EV 2022, కొత్త అవతార్‌లో 10.1” HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఈ విభాగంలో మొదటిసారి ఆండ్రాయిడ్ మరియు Apple Carplay కనెక్టివిటీతో వస్తుంది. MG యొక్క గ్లోబల్ U.K డిజైన్ సూచనలను కొత్త ZS EV ప్రతిబింబిస్తుంది, మంచి అభిరుచి గల కస్టమర్‌లకు మెరుగైన విశ్రాంతి అలాగే సౌకర్యం మరియు లగ్జరీ ఎలిమెంట్‌లను అందిస్తుంది. CASE (కనెక్టెడ్, అటానమస్, షేర్డ్ మరియు ఎలక్ట్రిక్) మొబిలిటీ యొక్క దృష్టితో నడిచే అత్యాధునిక కారు తయారీదారు ఈ రోజు ఆటోమొబైల్ విభాగమంతటా ‘ఎక్స్పీరియన్స్’ ను వృద్దిచేసింది.
ZS EVతో పాటు, MG తన వినియోగదారులకు 5-వే ఛార్జింగ్ ఎకోసిస్టమ్‌ను విస్తరిస్తుంది, ఇందులో భాగంగా నివాసాలు/కార్యాలయాల వద్ద ఉచిత AC ఫాస్ట్ ఛార్జర్, పోర్టబుల్ ఇన్-కార్ ఛార్జింగ్ కేబుల్, డీలర్‌షిప్‌లలో DC సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, 24×7 ప్రయాణంలో ఛార్జ్ చేసే సౌకర్యం (5 నగరాల్లో), మరియు శాటిలైట్ నగరాలు మరియు పర్యాటక కేంద్రాలలో ఛార్జింగ్ స్టేషన్లను విస్తరిస్తుంది.
ZS EV 2022 ఫ్రంట్-కవర్డ్ గ్రిల్ మరియు ఇప్పుడు MG లోగోకు ఎడమ వైపున ఉంచబడిన ఛార్జింగ్ సాకెట్, సన్‌రూఫ్ మరియు కొత్త 17-అంగుళాల రిఫ్రెష్ డిజైన్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను అందజేస్తుంది. కొత్త ZS EV అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ ఫాసియా, LED హెడ్‌ల్యాంప్స్, DRLలు, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, కొత్త బంపర్ మరియు కొత్త టెయిల్-లైట్ డిజైన్‌తో వస్తుంది. కప్‌హోల్డర్‌లు మరియు సెంటర్ హెడ్-రెస్ట్‌తో రియర్ సీట్ సెంటర్ ఆర్మ్-రెస్ట్‌ను పరిచయం చేయడం ద్వారా వెనుక-సీటింగ్ జోన్‌లో కూర్చున్న ప్రయాణీకులకు ఈ కారు అత్యుత్తమ తరగతి సౌకర్యాన్ని అందిస్తుంది. కొత్త ZS EV లో వెనుక కూర్చున్న ప్రయాణీకుల అదనపు సౌకర్యం కోసం రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్లను కూడా కలిగి ఉంటుంది.
MG మోటార్ 2020లో ZS EVని పరిచయం చేసింది మరియు ఈ కారు ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో అత్యంత ఆచరణాత్మకమైన ఆఫర్‌లలో ఒకటి – భారతదేశంలోని ఇతర EVలతో పోల్చినట్లైతే అతుత్తమ ఫీచర్ల సుదీర్ఘ శ్రేణిని కలిగి ఉంది. MG మోటార్ భారతదేశంలో ZS EV యొక్క రెండు విజయవంతమైన సంవత్సరాలను పూర్తి చేసింది, ఇది దేశంలో స్థిరమైన చలనశీలతకు బ్రాండ్ యొక్క నిబద్ధతకు గల ప్రధాన లక్షణం. రెండు సంవత్సరాలలో, MG దాదాపు 4,000 ZS EVల విక్రయాలను నమోదు చేసింది. MG భారతదేశంలో రెండవ అతిపెద్ద EV తయారీదారుగా అవతరించింది, ఈ విభాగంలో 27% మార్కెట్ వాటాను పొందింది.
MG భారతదేశంలో అనేక ‘ఫస్ట్’లను ప్రవేశపెట్టింది, వీటిలో భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నెట్ SUV – MG హెక్టర్, భారతదేశపు మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ SUV – MG ZS EV, మరియు భారతదేశపు మొదటి అటానమస్ (లెవల్ 1) ప్రీమియం SUV – MG గ్లోస్టర్ మరియు MG ఆస్టర్ – వ్యక్తిగత AI అసిస్టెంట్ మరియు అటానమస్ (లెవల్ 2) సాంకేతికతతో భారతదేశపు మొదటి SUV.