ర‌ఘురామ రూట్‌లోనే ఆనం రాంనారాయ‌ణ రెడ్డి

ర‌ఘురామ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియ‌ని వారు ఉండురు. అధికారంలో ఉన్న పార్టీ నుండి బ‌య‌ట వ‌చ్చి సొంత పార్టీ మీద యుద్ధం చేస్తున్న వ్య‌క్తి. ఈయ‌న బాట‌లోనే నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి ఒక‌రున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. పార్టీ చేస్తున్న ప‌నులు ఏవీ అత‌ని న‌చ్చ‌డం లేద‌ని తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆయన ఎవరో కాదు నెల్లూరు పెద్దాయనగా అంతా చెప్పుకునే మాజీ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి శ్రీ బాలాజీ జిల్లాలో కలిపేశారు. దాంతో ఆనం వారి ఆవేశం కట్టలు తెంచుకుంటోంది.

ఒక విధంగా ధిక్కార స్వరమే వినిపిస్తున్నారు. ఎవరిని అడిగి జిల్లాలను విభజించారు అంటూ ఆనం గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కొత్త జిల్లాల విభజన సహేతకంగా జరగలేదని దీని వల్ల రైతులు ఇబ్బంది పడతారని అలాగే సాగు నీటి ప్రాజెక్టుల వద్ద కొట్లాటలు కూడా జరుగుతాయని కామెంట్స్ చేశారు.

ఒక విధంగా ఉన్నతాధికారుల మీద ఆనం విరుచుకుపడినా ప్రతీ మాట కూడా అధినాయకత్వం మీదనే అని అర్ధమైపోతోంది. ఇక ఆనం ఇంతలా నోరు చేసుకున్నా ఆయనకు జవాబు ఇవ్వవద్దని వైసీపీ హై కమాండ్ నుంచి నెల్లూరు జిల్లా నేతలకు ఆదేశాలు వెళ్ళినట్లుగా చెబుతున్నారు. ఆనంని ఒక విధంగా లైట్ గా తీసుకోవాలనే హై కమాండ్ ఇప్పటికి డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

అదే సమయంలో ఆనం కనుక మరిన్ని మార్లు హాట్ కామెంట్స్ చేసినా అధినాయకత్వాన్ని ధిక్కరించినా కూడా అపుడు చూడవచ్చు అన్నది వైసీపీ పెద్దల ఆలోచనగా ఉందిట.

ఇక ఆనం తీరు చూస్తే ఆయన తనకు మంత్రి పదవి రాదు అని పక్కాగా ఫిక్స్ అయిపోయారు అంటున్నారు. దాంతో హై కమాండ్ ని నిందించి అయినా వేటు వేయించుకుని మరీ సింపతీ పొందాలని చూస్తున్నారని ఆ విధంగా తాను వైసీపీలో రెబెల్ ఎమ్మెల్యేగా మారాలని అనుకుంటున్నారు అని అంటున్నారు.

అంటే రఘురామ క్రిష్ణం రాజు తరహాలో ఇక మీదట ప్రతీ రోజూ ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ అధినాయకత్వాన్ని ఎండగట్టాలన్న వ్యూహమేదో ఉందని అనుమానిస్తున్నారు.

మరి రఘురామ మాదిరిగా ఆనం కూడా రివర్స్ అయితే వైసీపీ హై కమాండ్ ఏం చేస్తుంది అన్నది చూడాలి. మొత్తానికి రఘురామ బాటలో నెల్లూరు పెద్దాయన నడవడం మాత్రం ఒక విధంగా షాకింగ్ కాదు కానీ ఆసక్తికరంగానే రాజకీయాల్లో ఉందని అంటున్నారు.