కాంగ్రెస్ పాట పాడుతున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ స్వరూపాన్ని మరోమారు బయటపెడుతున్నారు. ఏ జాతీయ పార్టీతో ఎప్పుడు ఎలా ఉండాలనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ పాట పాడిన ఆయన ఇటీవల కాలంలో దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఎప్పుడు మైక్ దొరికితే చాలు వారి మీద విరుచుకుపడుతున్నారు. పెద్ద, చిన్న తేడా లేకుండా దేశ ప్రధాని అని చూడకుండా నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడేస్తున్నారు.
కానీ ఇప్పుడు స్వరం మార్చి కాంగ్రెస్ వంత పాడుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై విచక్షణ రహితంగా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు… రాహుల్ గాంధీని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. బీజేపీ సీఎం చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌కి బాసట నిలిచే ప్రయత్నం చేశారు. భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడు ఒక రాజకీయ వేత్తగా… కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ను తిట్టి , బీజేపీ కి దగ్గరై ఇప్పుడు బీజేపీని తిట్టి కాంగ్రెస్ దగ్గరవుతున్నారు. అయితే ఇదంత తెలంగాణ రాజకీయాల్లో భాగంగానే ఇలా స్వరం మార్చుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.