భార్య‌ల‌కు భ‌ర్త‌లు ఎందుకు స‌హాయం చేయ‌రు ? : జెనీలియా

గత ఏడు సంవత్సరాలుగా ఏరియల్‌ ఇండియా నిరంతరాయంగా ఇంటి పనుల విభజనలో అసమానతలను గురించి చర్చను తీసుకువస్తూనే మరింతమంది మగవారు షేర్‌ ద లోడ్‌ చేయాలని కోరుతుంది. ఇంటిలోపల సమానత్వం మరింతగా మెరుగుపరిచేందుకు ఏరియల్‌ ఇప్పుడు ‘సీ ఈక్వెల్‌’ అంటూ ప్రచార చిత్రం విడుదల చేసింది. దానితో పాటుగా ‘షేర్‌ద లోడ్‌ ’ప్రచారపు 5వ ఎడిషన్‌ను సైతం ప్రారంభించింది. దానితో పాటుగా మగవారు ఇతర మగవారితో కలిసి సమానంగా భారం పంచుకుంటున్నప్పుడు వారెందుకు తమ భార్యతో కలిసి భారం పంచుకోవడం లేదని ప్రశ్నిస్తుంది.

లాక్‌డౌన్‌ కారణంగా, ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తమ ఇంటినే ఆఫీసుగా, పాఠశాలగా, ఆటస్థలంగా మార్చుకున్నారు. చాలామంది మగవారు ఇంటిపనులలో చురుగ్గా పాల్గొనడంతో పాటుగా గర్వంగానూ భావించారు. అది క్లీనింగ్‌, కుకింగ్‌ లేదంటే లాండ్రీ ఏదైనా సరే ఉత్సాహంగానే పాల్గొన్నారు. అయితే లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే ఈ ధోరణి కూడా మారిపోయింది. అయితే మగవారు అవసరమైతేనేఇంటి పనులలో తోడ్పడతామని వెల్లడించడమూ పెరిగింది. ఓ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, తాము తమ రూమ్మేట్స్‌తో కలిసి ఉన్నప్పుడు ఇంటి బాధ్యతలు పంచుకుంటామని 73% మంది మగవారు వెల్లడిస్తున్నారు. గతంలో బాధ్యతలు పంచుకున్నప్పుడు ఇప్పుడెందుకు ఆ బాధ్యతలు పంచుకోరు ?

ఇదే ప్రశ్నను ఏరియల్‌ యొక్క నూతన ప్రచార చిత్రం సీ ఈక్వెల్‌ మగవారికి సంధిస్తుంది. దాదాపు 80% మంది మహిళలు తమ భాగస్వాములకు ఇంటి పనులు ఎలా చేయాలో తెలుసని చెబుతున్నారు. అదే సందర్భంలో 83% మంది ఇంటి పనుల దగ్గరకు వచ్చేసరికి తమను సమానంగా భావించడం లేదని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఏరియల్‌ ఎత్తి చూపడమే కాదు అంతా సమానమేనన్నప్పుడు భారం కూడా మనం పంచుకోవాలని వెల్లడిస్తుంది.

ఇంటి పనులలో భార్యకు సహాయపడని వారు తమ భార్యను తమతో సమానంగా భావిస్తున్నారని చెప్పలేమని ఈ చిత్ర ఆవిష్కరణ సందర్భంలో నటి జెనీలియా అన్నారు. ఏరియల్‌ సంస్థ నిర్వహిస్తున్న షేర్‌ ద లోడ్‌ ప్రచారం 5వ ఎడిషన్‌ ప్రారంభించడానికి రితేష్‌ దేశ్‌ముఖ్‌తో కలిసి ప్రత్యేకంగా హాజరయ్యారామె. వర్ట్యువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో మగవారితో సమానంగా మహిళలనూ చూడండి అంటూ చెప్పిన జెనీలియా తన వరకూ మాత్రం ఈ విషయంలో అదృష్టవంతురాలినేనన్నారు. లాక్‌డౌన్‌ సమయం అనేకాదు ఇతర సమయాల్లో కూడా రితేష్‌ తనకు ఇంటి పనులలో సహాయపడతాడని చెప్పిన ఆమె చాలామంది మగవారికి ఇంటి పనులు ఎలా చేయాలో తెలుసు. ఎందుకంటే బ్యాచులర్‌గా ఉన్నప్పుడు ఇతరులతో కలిసి రూమ్‌లో ఉన్నప్పుడు పనులు పంచుకుంటారు. అదే వివాహమైన తరువాత మాత్రం భారమంతా భార్యపైనే వేసేస్తారు. అది మారాల్సిన అవసరముందన్నారు. కిచెన్‌లో పనులు లేదంటే పిల్లలను చూసుకోవడం, లాండ్రీ ఏదైనా సరే భారం పంచుకుంటే ఆ సంసారం మరింత ఆనందమయమవుతుందన్న ఆమె ఇది నీ పని, అది నా పని అంటూ ఏమీ ఉండదన్నారు. ఈ సందర్భంలోనే మీరు మీ భార్యను ప్రేమిస్తే ఆమెను సమానంగా చూడాల్సిన అవసరముందన్నారు. గృహంలో సమానత్వం కోసం ఏరియల్‌ లాంటి బ్రాండ్లు కృషి చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు.

రితేష్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ షేర్‌ ద లోడ్‌ సీ ఈక్వెల్‌ ప్రచార చిత్రం చూసినవెంటనే యుఎస్‌లో తాను చదువుకున్న రోజులు గుర్తొచ్చాయన్నారు. అప్నట్లో తన స్నేహితునితో కలిసి ఇంటి పనులు పంచుకోవడం జరిగిందంటూ జెనీలియాకు స్నేహితునిగా ఉన్నప్పుడు ఎలాగున్నానో ఇప్పటికీ అలాగే ఉన్నానన్నారు. ఆమెకు వీలైనంత వరకూ తోడ్పడుతూనే ఉంటానన్నారు. స్త్ర్తీ, పరుషుల నడుమ తేడా ఏమీ లేదనే భావన పిల్లలుగా ఉన్నప్పుడే అలవాటు చేస్తే రాబోయే తరంలో మార్పు చూడవచ్చన్నారు.