మోడీ ప్రత్యక్ష యుద్ధానికి దిగిన తెరాస
రాష్ట్ర విభజన లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకం రేపుతున్నాయి. దీంతో తెలంగాణలో అధికార పార్టీ తెరాస నిరసన కార్యక్రమాలు చేయడానికి సిద్దమైంది. మోదీ వ్యాఖ్యలను అటు కాంగ్రెస్ తో పాటు, టీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. ఎంతో పోరాడి తాము తెలంగాణ తెచ్చుకుంటే, రాష్ట్ర విభజన సరిగా జరగలేదంటూ మోదీ అనడం టీఆర్ఎస్ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో విషం చిమ్ముతూ అడ్డగోలుగా మాట్లాడారంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపీ పార్టీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని సూచించారు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని తెలిపారు.