రామానుజం ఎంట్రీ చాలా ఖరీదు గురు
రామానుజం ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటి వెంట ఇదే మాట. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఓ ఒక్కరిని కదిపిన హైదాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన అతి పెద్ద విగ్రహాం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 2వ తేదీ నుండి విగ్రహా ఆవిష్కరణ ఉత్సవాలు పెద్ద ఎత్తున్న సాగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో ముగింపు కూడా జరగన్నున్నాయి. ఈ విగ్రహా ఏర్పాటుతో పాటు దేశంలోని 108 దేవాలయాల నమూనాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. దేశంలో ఆయా ప్రదేశాలకు వెళ్లకుండా ఒక్కసారి అడగుపెడితే 108 దేవాలయాల దర్శనం చేసుకోవచ్చు. రామానుజం విగ్రహాంతో పాటు అట్టహాసంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఆయా నేతలు, వ్యాపార వేత్తల నుంచి గట్టిగానే చందాలు రాబట్టవచ్చు. ఆ తరువాత వచ్చే ఖర్చులను ఏ విధంగా ఎదుర్కుంటారు అన్నదే ఇప్పుడు ప్రశ్నర్థాకంగా మారింది.
ప్రతి రోజు ఆయా దేవాలయాలకు పూజాలు చేయాలంటే దాదాపు వేలల్లో ఖర్చు వస్తుంది. ఒక్క దేవాలయానికి ఒక్కో పూజారి వారి జీతభత్యలు, భోజనాలు, వారి నివాసం ఖర్చులు, మేయిటనెన్స్, ఇతరత్రా ఖర్చులు అంతేకాకుండా భధ్రత విభాగం, గార్డెనింగ్‌తో పాటు నీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహాణ వీటితో పాటు విగ్రహా నిర్మాణానికి అయిన ఖర్చు, దేవాలయాల నిర్మాణం ఖర్చు ఇలా చెప్పుకుంటే ప్రతి ఒక్కటి భారీ ఖర్చుతో కూడుకున్నది.
అయితే ఇప్పటికీ చందాలు, ఇతరాత్ర ఖర్చలకు డబ్బులు ఉన్నా.. భవిష్యత్తులో మాత్రం కష్టంతో కూడుకున్నదనే చెప్పుకోవాలి. కాగా ఇప్పుడు ఇది పర్యటక ప్రాంతాంగా మారండంతో దీన్ని ఆయుధంగా మల్చుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. యాదగిరి గుట్టలో సమీపంలో ఉన్న సురేంద్రపురిలో ఇదే తరహాలో ఇక్కడ కూడా భారీగా ఎంట్రీ ఫీజు పెట్టే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
సమతా మూర్తి అందరకీ సమన్యాయం దక్కాలని చెప్పిన ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని విగ్రహా ఏర్పాటు చేసిన వారు భవిష్యత్తులో ఎలాంటి ఎంట్రీ ఫీజు పెడుతారో వేచి చూడాలి మరీ. అప్పుడు మన రామానుజం చాలా కాస్లీ గురు అవుతాడు.