ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్
ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ తమ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. నిఫ్టీ 100 ఇండెక్స్‌ను ప్రతిబింబిస్తూ దీర్ఘకాలంలో సంపదను సృష్టించడమే లక్ష్యంగా దీనిని తీర్చిదిద్దారు. ఈ ఇండెక్స్ ఫండ్‌తో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అగ్రగామిగా వెలుగొందుతున్న అతిపెద్ద 100 కంపెనీల నుంచి ప్రయోజనం పొందనున్నారు. ఆర్ధిక సేవలు, సమాచారసాంకేతికత, చమురు, సహజవాయు, వినియోగదారుల ఉత్పత్తుల రంగాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఫండ్ ప్రతి మదుపరునికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ మైక్రోసైట్ https://bit.ly/3HoT9K8 వద్ద ఈ ఫండ్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌ఓ)ను సోమవారం ఫిబ్రవరి 07, 2022 న తెరుస్తారు మరియు శుక్రవారం ఫిబ్రవరి 18,2022న దీనిని మూసి వేస్తారు.
ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్ ఆవిష్కరణ గురించి ఐడీఎఫ్‌సీ ఏఎంసీ సీఈఓ విశాల్ కపూర్ మాట్లాడుతూ ‘‘భారతీయ ఈక్విటీ లార్జ్ క్యాప్ ప్రపంచంలో అన్వేషించేందుకు సమర్థవంతమైన మార్గం ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్. నిఫ్టీ 100 ఇండెక్స్‌లో జోడించబడిన 100 అత్యుత్తమ వ్యాపార సంస్థలలో స్థిరమైన పోర్ట్‌ఫోలియో ద్వారా మదుపరులు దీనిద్వారా ప్రయోజనం పొందగలరు. డైవర్శిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే అతి తక్కువ ధరకు ఇది లభ్యమవుతుంది మరియు విభిన్నరంగాల వ్యాప్తంగా డైవర్శిఫికేషన్‌కు ఇది తోడ్పడుతుంది మరియు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా క్రమశిక్షణతో కూడిన పెట్టుబడిని ఇది అనుమతిస్తుంది’’ అని అన్నారు.
ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్ కోసం ఫండ్ మేనేజర్ నేమిష్ సేథ్ మాట్లాడుతూ ‘‘భవిష్యత్‌లో ఏ ఫండ్ లేదంటే సూచీల సమ్మేళనం అత్యుత్తమంగా లాభాలు అందిస్తుదన్నది మదుపరులకు సవాల్‌గా నిలుస్తుంది. నిఫ్టీ 100 ఇండెక్స్‌ను ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్ ట్రాక్ చేస్తుంది. ఇది పూర్తి, సమర్థవంతమైన ఎక్స్‌పోజర్‌ను లార్జ్ క్యాప్ యూనివర్శ్‌కు అనుమతిస్తుంది. మరీ ముఖ్యంగా నిఫ్టీ 100 ఇండెక్స్ కు దీర్ఘకాలపు మదురులకు భారీ లాభాలను తీసుకువచ్చిన చరిత్ర ఉంది. అందువల్ల మదుపరులు ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు’’ అని అన్నారు.