మోడీని చూసి కేసీఆర్‌కి జ్వరం వచ్చిందా ?
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఎడ మోహం, పెడ మోహంలాగా ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా… కేంద్రం ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల జరిగిన బడ్జెటట్ సమావేశంపై ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్… తనదైన వ్యంగ మాటలతో తూర్పారాబట్టారు. అయితే ఇవాళ మోడీ హైదారాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారికంగా… ప్రోటోకాల్ ప్రకారం సీఎం స్వయంగా వెళ్లి స్వాగతం పలికి సమావేశాలు పూర్తయ్యేవరకు ప్రధానితో ఉండి వీడ్కోలు చెప్పాలి. కానీ ఇందుకు దూరంగా సీఎం ఉన్నారు. సీఎం స్థానంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలుకుతున్నారు.
స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన మోదీ పర్యటకు దూరంగా ఉన్నారు. మరోవైపు ప్రధానికి స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చీఫ్ సెక్రటరీ, డీజీపీలు ఇప్పటికే చేరుకున్నారు. మోడీని చూసి సీఎంకి జ్వరం పట్టుకుందా అంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.