ఓవైసీ ఆడిందా డ్రామానేనా ?
హైదారాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరపడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైనది. ఇందుకు ప్రధాన కారణం ఉత్తరప్రదేశ్ (యూపీ) ఎన్నికలే. ఈ ఎన్నికల్లో భాగంగా ఆయన విసృత్తంగా యూపీలో ప్రచారం చేస్తున్నారు. ఎలాగైన యోగీ సర్కార్‌ని ఢీ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు అత్యధిక అసెంబ్లీ కలిగిన ఈ రాష్ట్రంలో ముస్లిం ఓట్లను రాబట్టుకునే పనిలో నిమ్మగ్నమైనారు.
అయితే గురువారం మీరట్‌లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారుపై ఆగంతకులు కాల్పులు జరిపారు. మీరట్, కిథౌర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వస్తున్న సమయంలో ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర అసద్ వాహనంపై ఆగంతకులు 3-4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అసద్ వాహనం టైర్లు పంక్చర్ కావడంతో మరొక వాహనంలో ఢిల్లీ బయలుదేరారు. ఓవైసీ అనుచరులు ఓ దుండగుడిని ఘటనా స్థలంలోనే పట్టుకున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని నోయిడా స్థానికుడిగా గుర్తించారు.
అయితే ఇప్పుడు రాజయకీయ వర్గాల్లో మాత్రం మరో అంశం కీలకంగా ప్రచారం అవుతోంది. ముస్లిం ఓట్లను రాబట్టుకోవడానికి సానుభూతి కోసం తనపై తనే కాల్పులు జరిపించుకున్నారని యూపీ భాజపా నేతలు, హైదారాబాద్ నేతలు అంటున్నారు. మరో మారు మతం రంగు పూయడానికి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఈ కాల్పుల వ్యవహారంతో యూపీ రాజకీయాలు మరింత హాట్ టాఫిక్‌గా మారాయి. అయితే అసద్ పై కాల్పులు జరిపిన వ్యక్తి .. బంధీగా ఉన్నాడు కాబట్టి అతను పెదవి విప్పితేనే నిజా నిజాలు బయటకు రానున్నాయి.