క్యాన్స‌ర్ సోకిన పిల్ల‌ల‌కు బొమ్మ‌లు పంచిన న్యూబ‌ర్గ్ డ‌యాగ్రోస్టిక్స్‌

ప్రపంచ క్యాన్సర్‌ డే సందర్భంగా, భారతదేశపు నాలుగో అతి పెద్ద పాథాలజీ సంస్థ న్యూబర్గ్‌ డయాగ్నాస్టిక్స్‌, ఎంఎన్‌జె క్యాన్సర్‌ ఆస్పత్రిలోని పిల్లల వార్డుకు బ్లాంకెట్లు విరాళంగా అందించింది. సమాజంలోని బాధిత వర్గానికి చేరువయ్యేందుకు, వారికి తగిన రీతిలో చేయూత అందించాలన్న న్యూబర్గ్‌ నిబద్ధతలో భాగం ఇది.

న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎ.గణేశన్‌ మాట్లాడుతూ, “భారతదేశంలో ఏటా దాదాపు 50,000 మంది పిల్లల్లో క్యాన్సర్‌ గుర్తించడం జరుగుతోంది. ఆ పిల్లలు ఎదుర్కొనే కష్టాలను దృష్టిలో పెట్టుకొని, వారు ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాటం చేసేందుకు వీలుగా న్యూబర్గ్‌ డయాగ్నాస్టిక్స్‌ తరపున వారి సౌకర్యం, సంతోషం కోసం బ్లాంకెట్లను విరాళంగా అందిస్తున్నాం. ఈ పిల్లలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం” అన్నారు.
సంస్థలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్‌ కన్సల్టెంట్‌ పాథాలజిస్టు డాక్టర్‌ శిరీషా పాల్గొన్నారు. క్యాన్సర్‌పై అవగాహన, లక్షణాల గురించి మాట్లాడుతూ “రకరకాల కాన్సర్లకు రకరకాల లక్షణాలు ఉంటాయి. అయితే క్యాన్సర్‌ బారిన పడిన పిల్లల్లో ఎదుగుదల తక్కువుంటుంది, బరువు పెరగరు, ఆకలి ఉండదు, ఈ లక్షణాలను తల్లిదండ్రులు గమనించాలి. ఈ లక్షణాలు పిల్లల్లో గుర్తించినట్టు అయితే వెంటనే డాక్టరు సంప్రదించాలి” అని సూచించారు.
ఈ తరహా చర్యలను ముంబయి సైన్ హాస్పిటల్‌, ఎస్‌ఎస్‌పీజీఐ హాస్పిటల్‌ నోయిడా, సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌, న్యూఢిల్లీలోనూ న్యూబర్గ్‌ డయాగ్నాస్టిక్స్‌ చేపట్టింది.