అసదుద్దీన్ ఓవైసీకి సానుబూతి ప్ర‌క‌టించిన మంత్రి కేటీఆర్‌

అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పుల ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది ఖచ్చితంగా పిరికిపందల చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్‌ ఒవైసీ భాయ్‌పై జరిగిన ఈ దాడి దారుణమని కేటీఆర్ అన్నారు. అసద్ భాయ్ మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం.. ఈ దాడి దారుణం. తీవ్రంగా ఖండించాల్సిన విషయం.. ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను.. అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు కేటీఆర్ పెట్టిన ట్వీట్‌పై పెద్ద దూమారం రేగుతోంది.