తెలంగాణలో కరెంట్ బిల్లులు ఇక దంచుడే
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించాయి. సుమారు 6వేల కోట్ల రూపాయల మేర పెంపు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలికి అందించినట్లు తెలుస్తోంది. ప్రతిపాదన ప్రకారం.. గృహ వినియోగదారులపై యూనిట్‌పై 50పై., వాణిజ్య వినియోగదారులకు 1రూ. పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాయి డిస్కంలు. ఇక డిస్కమ్‌లకు 10వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉన్నట్లు నివేదిక ద్వారా తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచకతప్పదనే సంకేతాలు అందించింది.