ష‌ర్మిల‌కి షాక్ ఆమ్ ఆద్మీలోకి ఇందిరా శోభ‌న్

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు ఇందిరా శోభ‌న్ పార్టీ వీడారు. ఇటీవ‌ల తెలంగాణ‌లో రాజ‌కీయ అవ‌స‌రం ఉంద‌ని అందుకే పార్టీ పెడుతున్నాన‌ని చెప్పిన ఏపీ సీఎం చెల్లెలు ష‌ర్మిల పార్టీ స్థాపించింది. ఈ పార్టీ పెట్టిన వెంట‌నే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇందిరా శోభ‌న్ ష‌ర్మిల చెంత‌కు చేరింది. ష‌ర్మిల‌కు పార్టీలో నీడ‌లాగా మారింది. ఓ కార్య‌క్ర‌మం చేసినా.. ష‌ర్మిల ప‌క్క‌నే ఉండేది. అయితే మారిన రాజ‌కీయ ప‌రిణామాల్లో ఆమె ఢిల్లీ కేంద్రంగా ప‌ని చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీలో చేరింది. స్వ‌రాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత అభివృద్ధి కుంటుప‌డింద‌న్నారు. అవినీతి చేసిన వారంతా భాజ‌పాలో చేరుతున్నార‌ని ఆరోపించారు. ఇక తెలంగాణలో ఆమ్ఆద్మీ జెండా ఎగ‌ర‌వేయ‌డమే త‌మ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు.