తెలంగాణలో 50 దాటిన ఓమిక్రాన్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో అంతకంతకు ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రజలు ఇప్పటికే భయందోళనకు గురవుతున్న సమయంలో కేసులు పెరగడం మరింత భయాన్ని సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారు. వారిని కలిసిన వారిలో మరో ఇద్దరికి కూడా ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 55కి పెరిగింది. వారిలో 10 మంది కోలుకున్నారు.
మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 37,839 శాంపిల్స్ పరీక్షించగా, 182 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 90 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.