కేసీఆర్ స్కేచే వేరబ్బా…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచనలు ఎవరికి అంతుపట్టవు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఎలా అమలు చేస్తారో ఏ ఒక్కరి కూడా అంతుచిక్కనివ్వరు. రాజకీయాల్లో అరితేరిన దురందరుడు అనడంతతో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అనేక విషయాల్లో వెల్లడైంది. తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు అతను తీసుకున్న నిర్ణయాల పట్ల తనదైన శైలిలో అమలు చేశారు.
రాష్ట్ర ప్రజల్లో మొప్పు సాధించడానికి తనిని తానే దోషిగా చేసుకొని… వెను వెంటనే నిర్ధోషిగా ప్రజల చేత అనిపించడంలో దిట్ట. ఇటీవల కాలంలో తెలంగాణలో యాసంగి పంట వేస్తే రైతుబంధు పథకం ఇవ్వమని తన స్వంత ప్రతికలో బ్యానర్ వార్తగా ప్రచూరించారు. అదే రోజు సాయంత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అలా చేయడం సరికాదని తెలిపారు.
నమస్తే తెలంగాణలో వార్త ప్రచూరణ కాకముందే… ఈ వార్తను ప్రజల్లోకి వదిలారు. దీనిపై విసృత్తమైన వ్యతిరేకత రావడంతో దాన్ని మరింత హీట్‌గా మార్చేప్రయత్నంలో నమస్తే తెలంగాణలో వార్త ప్రచూరణ చేశారు. దీనికి వ్యవసాయశాఖ ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చిందని.. వార్త వచ్చింది. తెలంగాణ సీఎం తప్పా ఏ ఒక్క మంత్రి, ఆయా శాఖల అధికారులు తమంతట తాముగా నిర్ణయం తీసుకొని వాటిని సీఎంకి చెప్పడం అనేది సహాసమే అని చెప్పుకోవాలి. తెలంగాణలో నియంతలాంటి పాలన జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి అతని అధికారులు ధైర్యం చేసి నివేదికలు ఎలా ఇస్తారు. అసలే తెలంగాణ సీఎం రైతులకు అండగా నిలచే వ్యక్తిగా పేరు పొందారు. ఇలాంటి తరుణంలో వ్యతిరేక నిర్ణయాలు ఎలా తీసుకుంటారు.
దీనిపై రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు అమలు చేస్తామని శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వరివేస్తే రైతులకు రైతు బంధు ఆపాలని తెలిపిన అధికారుల సూచనలను కేసీఆర్ తిరస్కరించారు. అధికారుల సూచనలపై తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించిన సీఎం.. రైతు బంధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు
దళిత బంధు పథకాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దళితబంధుపై విపక్షాల రాద్ధాంతం చేస్తున్నాయని, వాటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేసీఆర్ స్పష్టంచేశారు. మొదట హుజురాబాద్‌తో పాటు నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో దళితబంధు అమలు చేస్తామని, తరువాత రాష్ట్ర వాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.
నిజానికి రాజకీయంగా కేసీఆర్‌ని మించిన వ్యుహాత్మకుడు మరొరు లేరని రుజువైంది.